గోపీచంద్‌తో కలిసి ఈ స్టార్ డైరెక్టర్లు సినిమా తీస్తే మాత్రం.. బాక్సాఫీస్ బద్దలే!

యాక్షన్ హీరో గోపిచంద్ తండ్రి, డైరెక్టర్ టీ. కృష్ణ నేటి భారతం, ప్రతిఘటన సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. సామాజిక అంశాలపై సినిమాలు తీసి కమర్షియల్ హిట్స్ అందుకున్న ఘనత ఆయనది. అయితే కృష్ణ అనారోగ్యంతో 1986 అక్టోబర్ 21న మరణించాడు. ఆ తరువాత గోపి చంద్ కి కష్టాలు మొదలయ్యాయి. ఏ బలమైన సపోర్ట్ లేకుండానే ఈ హీరో మూవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. 2001లో తొలివలపు మూవీలో హీరోగా తన సినీ ప్రస్థానాన్ని మొదలెట్టి జయం, నిజం, వర్షం సినిమాల్లో విలన్‌గా నటించి అదరగొట్టాడు. మళ్లీ యజ్ఞం సినిమాతో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆంధ్రుడు, రణం, లక్ష్యం సినిమాలతో ఫుల్ ఫేమస్ అయ్యాడు. అయితే ఎందుకో గానీ స్టార్ డైరెక్టర్లు అతనితో ఒక్క మాస్ సినిమా కూడా తీయలేదు. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొందరి డైరెక్టర్లు అతనితో కలిసి సినిమా తీసినట్లయితే బాక్సాఫీస్ బద్దలై ఉండేది. మరి ఆ డైరెక్టర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

రాజమౌళి

రవితేజకి విక్రమార్కుడు సినిమాతో మంచి లైఫ్ ఇచ్చాడు రాజమౌళి. అలానే జక్కన్న యాక్షన్ స్టార్ గోపీచంద్‌తో కూడా ఒక పవర్‌ఫుల్ సినిమా తీస్తే అద్దిరిపోతుంది!

వి.వి వినాయక్‌

ఆది, చెన్నకేశవ రెడ్డి వంటి యాక్షన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు వి.వి వినాయక్‌. ఈ మాస్ డైరెక్టర్ మాస్ ఇమేజ్ ఉన్న గోపీచంద్‌తో ఒక యాక్షన్ డ్రామా తీస్తే అది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం పక్కా!

బోయపాటి శ్రీను

అఖండ ఫేమ్ బోయపాటి శ్రీనుకి టాలీవుడ్‌లో గోపీచంద్‌కి మించిన యాక్షన్ హీరో మరెవ్వరూ దొరకరు. వీరిద్దరి కాంబోలో ఒక మూవీ వస్తే అది రికార్డులను తిరగరాయడం ఖాయం.

కొరటాల శివ

కొరటాల శివ గారూ.. గోపీచంద్‌తో వీలైతే ఓ సినిమా తీయండి, పోయేదేముంది మహా అంటే ఆడియన్స్ ఓ మంచి హిట్ ఇస్తారు అని ధైర్యంగా చెప్పొచ్చు. టీ కృష్ణ గనుక ఇప్పుడు ఉన్నట్లయితే.. కొరటాల శివతో కలిసి తన కొడుకుని హీరోగా పెట్టి ఒక మంచి సోషల్ ఓరియంటెడ్ సినిమా తీసి పాన్ ఇండియా లెవెల్‌లో రికార్డులు బద్దలు కొట్టేవారు.

హరీష్ శంకర్

గబ్బర్ సింగ్‌ వంటి ఇంటెన్స్ మాస్ యాక్షన్ డ్రామా తెరకెక్కించిన డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ స్టార్ డైరెక్టర్ కూడా గోపీచంద్‌తో కలిసి ఒక మంచి మాస్ యాక్షన్ సినిమా తీసుకురావచ్చు.

పూరి జగన్నాథ్

ఈ మ్యాచో స్టార్ హీరోగా పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమా తీసినా రికార్డులు తిరగ రాయచ్చు.

సంపత్ నంది, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని బాబీ వంటి దర్శక దిగ్గజాలకు కూడా గోపీచంద్ ఒక మంచి ఆప్షన్ అవుతాడు. వీరిలో ఎవరైనా సరే ఈ యాక్షన్‌ స్టార్‌తో కలిసి సినిమా తీస్తే.. అది మైండ్ బ్లోయింగ్ సక్సెస్ అందుకునే అవకాశం ఉంది. మరి భవిష్యత్తులోనైనా ఈ మ్యాచో స్టార్‌తో పైన పేర్కొన్న డైరెక్టర్లు సినిమా తీస్తారు లేదో చూడాలి.