ఆ విషయంలో వాణి శ్రీ ఎందుకు అలా ప్రవర్తించిందో తెలుసా..?

వాణిశ్రీ.. ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె తన నటనతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ , ఏఎన్నార్ కాలంలో హీరోయిన్ల గురించి మాట్లాడుకుంటే ముందుగా వినిపించే పేర్లు వాణిశ్రీ , సావిత్రి, అంజలీదేవి, జమున , చంద్రకళ.. వీరందరూ ఎన్టీఆర్ , ఏఎన్నార్లతో కలిసి సినిమాలలో నటించడమే కాకుండా మంచి గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరోయిన్లని చెప్పవచ్చు. ఇక వీరందరిలో వాణిశ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్టార్ హీరోలతో సమానంగా పారితోషకం అందుకొని ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి హీరోలతో ఎన్నో సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ విజయం తన ఖాతాలో వేసుకుంది.

ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ వాణిశ్రీ పోషించే పాత్రలు మాత్రం చాలా విభిన్నంగా ఉండటమే కాకుండా ప్రతి ఒక్కరిని చాలా ఆకట్టుకునేవి. సొగసరి కోడలిగా, గడసరి అత్త పాత్రలో అలాగే మోడ్రన్ అమ్మాయిలా ఇలా విభిన్నమైన పాత్రలు వేస్తూ చాలా విభిన్నంగా కనిపిస్తూ ఉండేది. ఈ క్రమంలోనే ఈమెకు ప్రేక్షకుల్లో కూడా హీరోలతో పోలిస్తే ప్రత్యేకమైన గుర్తింపు వాణిశ్రీ కి లభించిందని చెప్పవచ్చు. ఇక తన కెరీయర్లో 200 పైగా చిత్రాలలో నటించిన ఈమె కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది.I was once tipped as a style icon: Vanisri

ఇకపోతే పారితోషకం విషయంలో ఏమాత్రం ఆశపడకుండా కేవలం ఆమె ఆలోచనలకు తగ్గట్టుగా పాత్ర వస్తే చేస్తాను అంటూ చెప్పింది. అంతేకాదు పాత్ర నచ్చకపోతే దర్శకనిర్మాతల ముఖం మీదే చేయను అంటూ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఒకానొక సందర్భంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ల తో గొడవ కారణంగా ఇండస్ట్రీ బహిష్కరణకి కూడా గురి అయింది. అభిమానులు పోరాటం చేయడంతో మళ్లీ సర్దుకుపోయి ఆమెను ఇండస్ట్రీలో కొనసాగించేలా చేశారు. ఈ క్రమంలోనే ఆ విషయంలో వాణిశ్రీ అలా చేస్తుందని ఎవరు అనుకోలేదట. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ఒక జర్నలిస్టు ఒకానొక సమయంలో వాణిశ్రీ దగ్గరకు వచ్చి 50 వేల రూపాయలు ఇస్తే మీ గురించి పత్రికల్లో మంచిగా రాస్తానని.. లేదంటే లేనిది కల్పించి రాస్తానంటూ బెదిరించాడట.Vanisri: వ్యాంప్ పాత్రల నుంచి స్టార్ హీరోయిన్ గా కళాభినేత్రిగా ఎదిగిన ఈ నటి  జీవితం నేటి తరానికి ఆదర్శవంతం | Untold story about senior actress  kalabhinetri vanisri ...

రిపోర్టర్ అలా అనడంతో ఆగ్రహంతో ఊగిపోయిన వాణిశ్రీ షూటింగ్ స్పాట్ కి రమ్మని చెప్పి అతని దగ్గర కూర్చోబెట్టుకొని ఎంతో ఓపికగా ఇలా చేయడం కరెక్ట్ కాదు అని, ఎంతో శాంతంగా చెప్పడానికి ప్రయత్నించినా అతను వినలేదట. దీంతో కోపం వచ్చిన ఆమె ఏకంగా అందరి ముందే రిపోర్టర్ ను చెప్పు తీసుకొని చెంప వాయించిందట. ఇక ఇలా వ్యక్తిత్వంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత పలు సీరియల్స్ లో కూడా నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది.