ఏపీ స‌రే.. మ‌రి తెలంగాణ సంగ‌తేంది ప‌వ‌న్ సార్‌?!

నాయ‌కులు ఎవ‌రైనా.. ఒక‌వైపే మాట్లాడితే ఎలా ఉంటుంది? ఒక‌వైపే చూస్తే.. ఎలా ఉంటుంది.? తిట్టిపో యరా? విమ‌ర్శ‌లు గుప్పించ‌రా? ఇదే ఇప్పుడు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలోనూ జ‌రుగుతోంది. ఆయ‌న తెలంగాణ‌లోనూ పోటీ చేస్తాన‌ని.. ఏకంగా 30 స్థానాల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అంటే.. తెలం గాణ ప్ర‌జ‌ల ఓట్ల‌ను ఆయ‌న కోరుతున్నారు క‌దా! అక్క‌డ కూడా కుదిరితే గెలుపు గుర్రం ఎక్కుతారు క‌దా! మ‌రి అక్క‌డి ప్ర‌జ‌ల ఓట్లు కావాల్సిన ప్పుడు… అక్క‌డిప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు కూడా ప‌ట్టించుకోవాలి క‌దా!!

కానీ, జ‌న‌సేన అధినేత మాత్రం.. తెలంగాణ స‌మ‌స్య‌ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ప‌న్నెత్తు మాట మాట్లాడ‌లేదు. నిజానికి అక్క‌డ ప్ర‌తిప‌క్షాలు రోజూ.. కేసీఆర్ స‌ర్కారుపై విరుచుకుప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ము ఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధ‌ర‌ల‌ను కేంద్రం త‌గ్గించింది. అయితే.. రాష్ట్రాలు కూడా త‌గ్గించాల‌ని కోరింది. కానీ, తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఆదిశ‌గా చ‌ర్య‌లు తీసుకోలేదు. ఏపీలోనూ ప్ర‌భుత్వం పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌న‌ను త‌గ్గించ‌లేదు.

అయితే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ఏపీపై విరుచుకుప‌డ్డారు. ఏపీలోనూ.. పెట్రోల్ ధ‌ర‌లు త‌గ్గించాల‌ని.. ఆయ న డిమాండ్ చేశారు. రోడ్ల అభివృద్ధికి అంటూ.. లీట‌రుకు రూ.1 చొప్పున వ‌సూలు చేస్తున్నార‌ని.. కానీ, రోడ్లు వేయ‌డం లేద‌ని.. కాబ‌ట్టి.. దానిని కూడాత‌గ్గించాల‌ని సూచించారు. రాష్ట్రంలో పెట్రోల్ , డీజిల్ ధ‌ర‌లు త‌గ్గిస్తే.. క‌చ్చితంగా 75 నుంచి 80 రూపాయ‌ల‌కే ప్ర‌జ‌ల‌కు పెట్రోల్ అందుబాటులోకి వ‌స్తుంద‌న్నారు. నిజ‌మే.. కావొచ్చు.. మంచి సూచ‌న‌లే. ఈ విష‌యంలో త‌ప్పు ప‌ట్టడానికి ఏమీలేదు.

అయితే… అదేస‌మ‌యంలో తెలంగాణ‌లో ఎందుకు డిమాండ్ చేయ‌డం లేదు? అనేది మౌలిక ప్ర‌శ్న‌. తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు క‌దా! అలాంటప్పుడు.. అక్క‌డి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను కూడా ప‌రిష్క‌రించాల్సిన‌, పోరాడాల్సిన అవ‌స‌రం ఉంది క‌దా! అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ఒక వైపే చూస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. దీనిపైనే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. మ‌రి దీనికి ప‌వ‌న్ ఏం స‌మాధానం చెబుతారో చూడాలి.