బెట్టు చేస్తే బొక్కే… టీడీపీ – జ‌న‌సేన‌తో పొత్తుపై బీజేపీ ట్విస్ట్ ఇచ్చేసింది…!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి రాష్ట్రంలో పొత్తులు పొడిచేందుకు రంగం సిద్ధ‌మైంది. టీడీపీ-జ‌న‌సేన‌లు పొత్తు దిశ‌గా స‌మాలోచ‌న‌లు చేస్తున్నాయ‌నే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. అయితే.. టీడీపీతో క‌లిసి ప‌నిచే సేందుకు.. బీజేపీ స‌సేమిరా అంటోంది. గ‌తంలో మోడీని చంద్ర‌బాబు అవ‌మానించార‌ని.. ఆయ‌నకు వ్య‌తిరేకంగా.. పార్ల‌మెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టార‌ని.. కుటుంబం లేని వారికి మ‌హిళ‌ల విలువ ఏం తెలుస్తుందంటూ..వ్యాఖ్యానించార‌ని.. అలాంటి పార్టీతో పొత్తుకు తాము ఎలా ముందుకు వ‌స్తామ‌ని.. పార్టీ నేత‌లు చెబుతున్నారు.

ఈ విష‌యంలో ఓ వ‌ర్గం బీజేపీ నాయ‌కులు త‌ట‌స్థంగా ఉన్నా.. రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వ‌ర్గం మాత్రం ఫైర‌వుతోంది. పైకి ఎక్క‌డా.. ఆయా విష‌యాలు చెప్ప‌రు.కానీ, కేంద్రం చెవిలో మాత్రం పాత పాట‌లు గుర్తుకు తెస్తున్నారు. ఎందుకంటే.. మ‌ళ్లీ మ‌ళ్లీ ఆ వ్యాఖ్య‌లు గుర్తు చేయ‌డం ఇష్టం లేక కాదు.. ఆ వ్యాఖ్య‌లు.. గుర్తు చేస్తే..ప్ర‌జ‌ల్లో మ‌రోసారి మోడీ ప‌ట్ల వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌నే ఆలోచ‌న కావొచ్చు. అయితే.. సోము వ్యాఖ్య‌ల‌ను త‌ట‌స్థంగా ఉన్న నాయ‌కులు ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో బెట్టు ప‌నికి రాద‌నేదివారి భావ‌న‌.

ఎందుకంటే.. పొత్తుల విష‌యంలో రాష్ట్రంలో బీజేపీ నేత‌ల‌ను తీసుకుంటేఏ.. ఒక్క సోము ఆయ‌న వ‌ర్గం.. త‌ప్ప‌. మిగిలిన వారంతా కోరుకుంటున్నారు. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన బీజేపీ నాయ‌కులు కూడా ఈ విష‌యంలో సోమును విభేదిస్తున్నారు. “పార్టీ ఇప్ప‌టికైనా కోలు కోవాలంటే.. కొన్ని కొన్ని విష‌యాల‌ను ప‌క్క‌న పెట్టాలి. చంద్ర‌బాబు క‌న్నా. మ‌హారాష్ట్రలో శివ‌సేన నాయ‌కులు బీజేపీని దుమ్మెత్తి పోస్తున్నారు. అక్క‌డ స‌ర్దుకు పోవ‌డం లేదా..? ఎప్పుడు అవ‌కాశం ఇస్తే అప్పుడు శివ‌సేన‌తో చేతులు క‌లిపేందుకు బీజేపీ సిద్ధంగా లేదా. “ అని ఒక సీనియ‌ర్ నాయ‌కుడు వ్యాఖ్యానించారు.

మ‌రికొంద‌రు సీనియ‌ర్లు.. ఇంకా డెప్త్‌గా ఆలోచిస్తున్నారు. “ఒక్క నేత ఆలోచ‌న కార‌ణంగా.. పార్టీ మొత్తం భ్ర‌ష్టు ప‌ట్టిపోయేలా ఉంది. దీనిని మేం స‌హించం. దీనిపై కేంద్రం పెద్ద‌లు వ‌స్తే.. నిర్మొహ‌మాటంగా చెబుతాం. పొత్తులు స‌హ‌జం. శాశ్వ‌త మిత్రులు.. శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌రు.. సో.. పొత్తులు పెట్టుకుంటే పోయేది ఏంలేదు“ అని వ్యాఖ్యానిస్తున్నారు. అంటే.. పొత్తుల‌కు సిద్ధ‌ప‌డితే.. క‌నీసం.. రెండు నుంచి నాలుగుస్థానాలు ద‌క్కించుకునే అవ‌కాశం ఉంద‌ని వీరు చెబుతున్నారు.