వాట్..బన్నీ మెగా హీరో కాదా..ఆ మీటింగ్ లో ట్యాగ్ తీసేసారే..?

యస్..ఇప్పుడు ఇదే విషయం నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అసలే గత రెండు మూడు సంవత్సరాల నుండి మెగా VS అల్లు అంటూ సరికొత్త వార్ జరుగుతుంది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అల్లు అర్జున్ మెగాస్టార్ బర్తడే వేడుకలకు రాకపోవడం..మిగతా మెగా హీరోలతో కలవక పోవడంతో..మ్యాటర్ మరింత ముదిరిపోయింది. కాగా, రీసెంట్ ఆ విషయాని కి ఆజ్యం పోస్తూ ఓ ప్లెక్సీ ప్రత్యేక్షమైంది. దీంతో మెగా ఫ్యాన్స్ VS అల్లు ఫ్యాన్స్ అంటూ సోషల్ మీడియాలో వార్ మొదలైంది.

ఆంద్ర ప్రదేశ్ లోని విజయవాడలో మెగా అభిమాన సంఘాల అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. అంతా బాగుంది..కానీ ఈ సమావేశానికి సంబంధించిన బ్యానర్ లో అల్లు అర్జున్ ఫోటో లేదు. కేవలం ఫ్యాన్స్ చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, నాగ బాబు ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అంతేనా ఈ మీటింట్ కి మెగా హీరో అభిమానుల అందరికి ఆహ్వానం అందింది. చాలా గ్రాండ్ గా జరిపారు. కానీ అల్లు ఫ్యాన్స్ కి మాత్రం ఒక్క ఆహ్వానం కూడా ఇవ్వలేదట. అంతేకాదు అల్లు అర్జున్ పేరు కూడా బయటకు రాకుండా..అస్సలు ఆ ఊసే ఎత్తకుండా ఉన్నారట.

ఈ క్రమంలో అల్లు అర్జున్ కి మెగా హీరో ట్యాగ్ తీసేశారని. ఇక పై ఆయన మెగా హీరో కాదని అంటున్నారు జనాలు. ఈ బ్యానర్ తో మెగా కేటగిరీ నుండి అల్లు అర్జున్ ని తొలగించినట్లైంది. సరే ఇది పెద్ద మ్యాటర్ కాదు చిన్న మీటింగ్ నే లే..అనుకునేదానికి లేదు.. ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి నాయుడు ఆధ్వరంలో జరిగిన మీటింగ్. అంత ఆషామాషీ అనామకులు సమావేశం గా తీసిపారేయలేం. దీంతో అల్లు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పాన్ ఇండియా హీరో మా బన్నీ ని ఎవ్వరు తక్కువ చేసిన చూసి ఊరుకోం అంటూ బన్నీ కి సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఫ్లెక్సీ మెగా – అల్లు ఫ్యాన్స్ మధ్య పెద్ద చిచ్చే పెట్టిన్నట్లైంది. మరి చూద్దాం ..ఈ విషయం పై మెగా హీరోస్ ఎలా స్పందిస్తారో..?

Share post:

Popular