పవన్ పక్కన మరో స్టార్ హీరో..సినిమా మాస్ కి అమ్మ మొగుడులా ఉండదు..?

ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసిన మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువైపోయాయి. పాత కాలంలో లో అంటే ఇలాంటి సినిమాలు ఎక్కువుగా తీసేవారు. కానీ రాను రాను అలా ఇద్దరు హీరోలు కలిసి సినిమాలు తీయ్యడమే మానేసారు..ప్రజలు చూడటం మానేశారు. కానీ, దిల్ రాజు-శ్రీకాంత్ అడ్డాల మళ్ళీ ఆ సాంప్రదాయానికి తెర లేపారు. స్టార్ హీరోలైన వెంకీ-మహేష్ లను పెట్టి స్సితమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు అనే సినిమా తెరకెక్కించి మల్టీ స్టారర్ మూవీలు జనాలు చూస్తారు..ఆ సినిమా ల ద్వారా కూడా హిట్ కొట్టచ్చి అని ప్గ్రూవ్ చేశాడు.

ఇక ఆ తరువాత వరుసగా హీరోలందరూ మంచి కధ దొరికిన్నపుడల్లా మల్టీ స్టారర్ మూవీలు చేయడానికి ఇష్టపడుతున్నరు. తాజా గా తెర పైకి మరో భారీ మల్టీస్టారర్ మూవీ రానున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా భీమాలా నాయక్ సినిమాతో తిరుగులేని విజయాని అందుకున్న ఈ పవర్ స్టార్ హీరో..తాజా మరో పవర్ ఫుల్ సినిమాకి కమిట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. కాకపోతే ఇది కూడా రీమేక్ సినిమా అవ్వడం గమనార్హం.

పవన్ కళ్యాణ్ తన 25 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ లేనంత స్పీడ్ గా వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నాడు. అంతే త్వరగా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఇప్పతికే చేతిలో నాలుగు సినిమాలు రెడీ గా పెట్టుకుని ఉన్న ఈయన తాజాగా మరో సినిమాకి సైన్ చేసిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ సురేందర్ రెడ్డి తో ఓ సినిమా కమిట్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఈ ఇంట్రెస్టింగ్ వార్త లీకై నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. ఈ సినిమాలో పవన్ తో పాటు మరో హీరో ఉంటాడని..ఆ పాత్ర కోసం మాస్ మహా రాజ రవితేజ ను తీసుకున్నట్లు తెలుస్తుంది. మామూలుగానే పవన్ సినిమా అంటే రచ్చ మామూలుగా ఉండదు..ఇక దానికి తోడు రవితేజ లాంటి మాస్ హీరో తోడైతే.. మాస్ అనే పదానికి అమ్మ మొగుడులా ఉంటుంది సినిమా అంతూ పవన్-రవితేజ అభిమానులు అంటున్నారు. ఈ సినిమా వీలైనంత త్వరగా తెరకెక్కితే బాగుండు అంటూ కోరుకుంటున్నారు. మరి చూడాలి ఈ సినిమా పై అఫిషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..?