ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న హాట్ గ్యాసిప్ ఏదైనా ఉంది అంటే అది నందమూరి నటసింహం బాలకృష్ణ – రాజమౌళి కలిసి చేయబోయే సినిమా గురించే..! సీనియర్ హీరో బాలయ్య రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో నటిస్తున్నాడు. అయితే అది సోలో హీరోగా కాదు.. మహేష్‌బాబు – రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కే సినిమాలో బాలయ్య సెకండాఫ్‌లో ఓ కీలక పాత్రలో కనిపిస్తాడట.
మహేష్‌బాబు – రాజమౌళి కాంబినేషన్లో సినిమా కోసం దాదాపు 15 సంవత్సరాలుగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి త్రిబుల్ ఆర్ ప్రమోషన్లు పూర్తి చేసుకున్న వెంటనే మహేష్‌బాబు సినిమా కోసం వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఈ లోగా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా పూర్తి చేసుకున్న వెంటనే త్రివిక్రమ్ సినిమా ఫినిష్ చేస్తాడు. అప్పుడు బాలయ్య – మహేష్‌బాబు – రాజమౌళి సినిమా ఉంటుంది.
ఇక ఈ సినిమాలో బాలయ్య పాత్ర థ్రూ అవుట్ ఉంటుందట. ఓవరాల్‌గా 40 నిమిషాల పాటు ఈ పాత్ర తెరమీద కనిపిస్తుందని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఈ విషయాన్ని రాజమౌళి అటు బాలయ్యతో పాటు, ఇటు మహేష్‌కు కూడా చెప్పేశాడట. ఇప్పుడు ఈ మ్యాటర్ బయటకు రావడంతో ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా తిరుగుతోంది.
ఇదే నిజమైతే ఇది టాలీవుడ్ వర్గాల్లో తిరుగులేని మల్టీస్టారర్ సినిమా అవుతుంది. బాలయ్యనే రాజమౌళి సినిమాలో ఉన్నాడు అంటే అది మామూలు హడావిడి కాదు.. ఏదేమైనా ప్రస్తుతం ఉన్న త్రిబుల్ ఆర్ హడావిడి తర్వాత ఈ సినిమా మీద పూర్తి క్లారిటీ రానుంది.