అయ్యగారికి అమ్మగారు దొరికిందోచ్..మళ్లీ పెళ్లికోడుకు కాబోతున్న అఖిల్..?

అక్కినేని వారసుడు అఖిల్ మళ్లీ పెళ్లికొడుకు కాబోతున్నాడా అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు. గత కొంతకాలంగా వరుస బాధకరమైన విషయాలతో అల్లాడిపోతున్న అక్కినేని అభిమానులకు త్వరలోనే నాగార్జున గుడ్ న్యూస్ చెప్పబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. సినీ వర్గాల దగ్గర నుండి అందుతున్న సమాచారం ప్రకారం..అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడట. ఇది వరకే ఓ పెద్దింటి అమ్మాయిని ప్రేమించి..ఇంట్లో చెప్పి ఒప్పించి..ఫైనల్ గా గ్రాండ్ గా కళ్లు చెదిరేలా నిశ్చితార్ధం చేసుకున్న ఈ యంగ్ హీరో..ఆమె తో ఆమె కుటుంబంతో వచ్చినా కొన్ని గొడవలు వల్ల..నాగార్జునాని అవమానించారంటూ అఖిల్ జరిగిన నిశ్చితార్ధాని క్యాన్సిల్ చేసుకున్నాడు.

అప్పట్లో ఈ ఇష్యూ పెద్ద హాట్ టాపిక్ గా మారింది. నేషనల్ మీడియాలో సైతం వార్తలు వచ్చాయి. దీంతో ఇండస్ట్రీలో నాగార్జున పరువు పోయ్యినట్లైంది. ఇక ఆ తరువాత కొన్నాళ్ళు..సైలెంట్ గా ఉండిపోయిన అఖిల్..మళ్లీ మెల్లగా సినిమాలోకి రావడం మొదలు పెట్టారు. నిన్న మొన్నటి వరకు చెప్పుకొతగ్గ హిట్ సినిమాలు పడని అఖిల్ ఖాతలో పూజా పుణ్యమా అంటూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా హిట్ అవ్వడం..దీంతో మొదటి సారి సినిమా హిట్ అయితే ఎలా ఉంటుందో రుచి చూశాడు అఖిల్. ఇప్పుడు కూడా వచ్చినా ఆఫర్లని ఓకే చేయకుండా నెమ్మదిగా ఒక్కో సినిమాను కంప్లీట్ చేసుకుంటూ పోతున్నాడు.

అయితే, ఇంట్లో ఇద్దరి కొడుకులు సింగిల్ గా తిరుగుతుండడం చూసి బాధపడుతున్న నాగ్.. కోడళ్లను తెచ్చుకోవాలని డిసైడ్ అయిపోయారట. నాగ చైతన్య విడాకుల కేస్ ఇంకా కోర్టు లోనే ఉంది. అధికారికంగా విడాకులు రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఈ టైంలో చిన్నోడు పెళ్ళి పనులు మొదలు పెట్టేశాడట నాగ్. ఇది వరకు లా కాకుండా..ఈసారి రాజకీయ బ్యాక్ గ్రౌండ్..సినీ బ్యాక్ గ్రౌండ్ లేని అమ్మాయిని కోడలు గా తెచ్చుకోబోతు న్నారట కింగ్ నాగార్జున. ఇప్పటికే అమ్మాయి తరపు వాళ్లతో అన్ని మాట్లాడేసిన నాగ్..త్వరలో సింపుల్ గా నిశ్చితార్ధం చేయడానికి రెడీ అవుతున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ కాబోయే కొత్త కోడలు పిల్ల ఎలా ఉండబోతుందో చూడాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. దీంతో అఖిల్ పెళ్లి మ్యాటర్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.