రొమాన్స్‌లో అరాచ‌కం చూపించిన జ‌బ‌ర్ద‌స్త్ జంట‌..!

జబర్దస్త్ కామెడీ షో రెండు తెలుగు రాష్ట్రాల లోనే కాదు వివిధ రాష్ట్రాలలో సెటిలైన తెలుగు వారు కూడా ఈ షో ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తెలుగు వారు ఈ షో ని బాగా ఆదరించడంతో పాటు మంచి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోయే విధంగా వీక్షిస్తూ..సహాయం కూడా చేస్తూ ఉండడం గమనార్హం. ప్రేక్షకులకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఇందులో ఉండే కమెడియన్లు తమ శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కాలంలో జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా ఫేమస్ అయింది రీతూ చౌదరి.

ఇక రీతూ చౌదరి ఈ షో ద్వారా తన పరిచయాన్ని మరింత పెంచుకుని బుల్లితెరపై ఒక రేంజ్ లో దూసుకెళుతోంది. జబర్దస్త్ లో కంటే ముందు ఎన్నో టీవీ సీరియల్స్‌లో నటించింది తర్వాత వెండితెరపై పలు సినిమాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. చూడడానికి అంత అందం గా లేక పోయినా తన నటనకు హాట్ హాట్ అందాలతో బుల్లితెర ప్రేక్షకులను అభిమానులను మార్చుకుంది ఈ ముద్దుగుమ్మ. మొదట్లో టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ బాగా పాపులారిటీని సంపాదించుకుంది.

ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అక్కడ సంపాదించుకున్న పాపులారిటీ వెండితెరపై సినిమాలలో నటించే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారమైన గోరింటాకు సీరియల్ లో కూడా ఈమె నటించింది. ఇక ప్రస్తుతం జబర్దస్త్ షోలో అడుగు పెట్టి లేడీ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుంది తన అందచందాలతో ప్రేక్షకులను నవ్విస్తూ ఫిదా చేసింది.

పొట్టి పొట్టి బట్టలతో కుర్రకారుకు మంచి మాస్ మసాలా సినిమా చూపించే ఈ ముద్దుగుమ్మ .. ఇటీవల కూడా కొన్ని ఫోటోలను , వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. అంతేకాదు ఇటీవల మరో షో లో కూడా ఇలా పొట్టి బట్టలతో బాగా రెచ్చిపోయి కుర్రకారు గుండెల్లో రైలు పరిగెట్టేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక తన తోటి నటుడితో ఈమె చేసే రొమాన్స్ కి ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు.