తొలి సినిమా సూప‌ర్ హిట్‌… అప్పుడే కుర్ర హీరోయిన్‌కు కాస్టింగ్ కౌచ్ క‌ష్టాలు..!

గ‌త మూడు నాలుగేళ్లుగా కాస్టింగ్ కౌచ్ అనే ప‌దం దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అవుతోంది. సౌత్ టు నార్త్ వ‌ర‌కు ఏ భాష‌లో అయినా హీరోయిన్లు, బుల్లితెర న‌టీమ‌ణులు, ఇత‌ర క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు నిర్భ‌యంగా తాము త‌మ కెరీర్‌లో ఎదుర్కొన్న లైంగీక వేధింపుల గురించి చెపుతున్నారు. ఇక శ్రీరెడ్డి లాంటి వాళ్లు మ‌రీ ర‌చ్చ చేస్తున్నారు. ఇక సింగ‌ర్ చిన్మ‌యి కూడా స్టార్ రైట‌ర్ అయిన వైరిముత్తు త‌న‌తో మిస్ బిహేవ్ చేశాడంటూ ఓపెన్‌గానే చెప్పేసింది.

తాజాగా సీనియ‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సుధ కూడా ఛాన్స్ కోసం గ‌తంలో ఓ హీరోతో పాటు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు త‌న‌తో గ‌డ‌పాల‌ని ఒత్తిడి చేశార‌ని చెప్పింది. ఇక కాస్టింగ్ కౌచ్‌, ప‌క్క‌లో ప‌డుకోవ‌డం అనేది ఇండ‌స్ట్రీలో ఇప్పుడు కాదు… ఎప్ప‌టి నుంచో ఉంది. అయితే ఇప్పుడు వ‌ర్థ‌మాన హీరోయిన్ కూడా కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొంటోంద‌ట‌. అస‌లే అచ్చ తెలుగు అమ్మాయి అన్న ముద్ర ఉంది.

ఆమె న‌టించిన తొలి సినిమాకు ప్లాప్ టాక్ తెచ్చుకున్నా కూడా క‌మర్షియ‌ల్‌గా స‌క్సెస్ అయ్యి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఓ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడి ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో తెర‌కెక్కిన ఈ సినిమాలో ఆమె ఓ స్టార్ హీరో వార‌సుడి ప‌క్క‌న న‌టించింది. అందం, అభిన‌యం ఉండ‌డంతో ఆమెకు వ‌రుస‌గా ఛాన్సులు వ‌స్తున్నాయి. ఓ స్టార్ హీరో సినిమాలో కూడా ఆమె పేరు ప‌రిశీల‌న‌కు వ‌చ్చింది.

అందాల పోటీల్లో పాల్గొని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ఆమె న‌ట‌న‌లో కూడా శిక్ష‌ణ తీసుకుంది. రెండో సినిమాకే రు. 40 ల‌క్ష‌లు తీసుకున్న ఆమె.. ఇప్పుడు వ‌రుస ఆఫ‌ర్ల‌తో రు. 75 ల‌క్ష‌లు అడుగుతోంద‌ట‌. ఆమెకు ఆఫ‌ర్లు బాగానే ఉన్నా కూడా బెడ్ రూమ్ డోర్ ఓపెన్ చేసేవాళ్లు ఎక్కువ అవుతున్నార‌ట‌. ఛాన్స్‌కు అయితే ఇబ్బంది లేదు. అయితే క‌మిట్‌మెంట్ మాత్రం ఇవ్వాల్సిందే అని మొహంమీదే అడిగేస్తున్నార‌ట‌.

ఇదే విష‌యాన్ని స‌ద‌రు కుర్ర హీరోయిన్ త‌న ఫ్రెండ్స్ స‌ర్కిల్లో చెప్పుకుని బాధ‌ప‌డింద‌ట‌. ఈ విష‌యం ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇండ‌స్ట్రీలో ఇవ‌న్నీ త‌న‌కు తెలియ‌న‌వి కావ‌ని.. అయితే ప్ర‌తి సినిమాకు ఇలా క‌మిట్‌మెంట్లా ? అని ఆమె వాపోతోంద‌ట‌.