సామ్ ఒప్పుకుంటే నాకు ఏం ప్రాబ్లం లేదు..బాలీవుడ్ బ్యూటీ ఓపెన్ స్టేట్మెంట్..!!

ప్రపంచంలో ఇంత మంది అమ్మాయిలు ఉండగా అందరు సమంతనే ఎందుకు ఇష్టపడుతున్నారో తెలియడం లేదు. పెళ్లికి ముందు అందరికి సమంతనే కావాలి..పెళ్లి అయిపోయాక సమంత కావాలి అంటూ మెసేజ్లు పెట్టారు. ఇప్పుడు మొగుడితో డైవర్స్ తీసుకుంటున్నప్పుడు కూడా అందరు సమంతనే కావలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేనా ఐ లవ్ యూ సమంత..మనం పెళ్ళి చేసుకుందాం అంటూ ఆమె ను ఓపెన్ గానే అడిగేస్తున్నారు. అంతలా ఆమెలో ఏముందో జనాలకు అర్ధంకావడం లేదు.

సరే..సామాన్యులు సంగతి పక్కన పెడితే..స్టార్ సెలబ్రిటీలు కూడా వాళ్ల సినిమాల్లో సమంతను హీరోయిన్ గా పెట్టుకోవడానికే ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. విడాకుల తరువాత అమ్మడు ఎక్స్ పోజింగ్ ఎక్కువ చేస్తుందనో..లేక నిజంగానే ఆమె టాలెంటెడ్ అని ఆ దర్శకులు నమ్ముతున్నారో తెలియదు కానీ..విడాకుల తరువాత సమంతకు అవకాశాలు ఎక్కువ అయ్యాయి. అయితే, స్టార్ హీరోయిన్స్ కూడా అమ్మడు తో నటించాలి అని ఉందని ఓపెన్ గా చెప్పేస్తున్నారు. ఇది అందరికి ఆశ్చర్య కలిగించే విషయమే.

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఆలియా భట్..ప్రస్తుతం టాలీవుడ్ లోను తన లక్ ఎలా ఉందో పరీక్షించుకోబోతుంది. దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాతో తనలోని టాలెంట్ ను .. అందాలను తెలుగు ప్రేక్షకులకు చూయించబోతుంది. ఇక రీసెంట్ గా ఆలియా ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ..స్టార్ హీరోయిన్ సమంత పై తన అభిప్రాయం వ్యక్తం చేసింది. సమంత నటన అంటే తనకు చాలా ఇష్టమని..ఆమె చేసిన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ చూసానని..అందులో సామ్ నటన తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చింది. అంతేకాదు సామ్ తో కలిసి నటించాలని ఉందని..తను ఒప్పుకుంటే ఖచ్చితంగా ఓ సినిమా చేస్తానని మీడియా ముందే చెప్పేసింది. అవకాశం వస్తే ఆమెతో కలిసి థ్రిల్లర్ సినిమా చేయాలనుకుంటున్నా అని ఆలియా ఓపెన్ గా చెప్పుకొచ్చింది. మరి ఆలియా కోరికను విన్న సామ్ ఊ అంటుందో..ఊ ఊ అంటుందో చూడాలి..?