బంప‌ర్ ఆఫ‌ర్‌ కొట్టేసిన ఖిలాడి భామ.. ఇక కింద మీద ఊపే..?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదైనా జరగచ్చు అని మరోసారి ప్రూవ్ చేసింది ఈ ఖిలాడి భామ. మాస్ మహారాజ రవి తేజ హీరోగా నటించిన ఖిలాడి సినిమాలో తనదైన స్టైల్ లో నటించి అదరగొట్టిన హాట్ బ్యూటీ డింపుల్ హయాతి. గల్ఫ్ అనే మూవీతో హీరోయిన్‌గా తొలిసారి ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత అడ‌పా త‌డ‌పా చిత్రాల్లో నటించిన‌ప్ప‌టికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కానీ మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దలకొండ గణేష్ మూవీలో హాట్ లుక్స్ లో జర్ర జర్ర పాటతో సూప‌ర్ క్రేజ్ సొంతం చేసుకుంది.

ఆ ఒక్క పాటతోనే అమ్మడు యూత్‌ను ఉర్రూతలూగించి..బడా దర్శకుల కళ్లు ఆమె పై పడేలా చేసుకుంది. దీని ద్వారా డింపుల్ హయాతికి మ‌రెన్నో ఐటెం సాంగ్ చేసే అవ‌కాశాలు వ‌చ్చాయి. కానీ అమ్మడుకి హీరోయిన్‌గానే సెటిల్ అవ్వాలనే కోరిక‌తో వాటిని రిజెక్ట్ చేస్తూ.. ఫైనల్ గా ఖిలాడి మూవీలో న‌టించే ఛాన్స్ కొట్టేసింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద ఊహించినంత విజయం అందుకోలేకపోయినా ఓ మోస్తరు మిక్సిడ్ టాక్ ను సంపాదించుకుంది. కొన్ని వర్గాల ప్రజలకు ఈ సినిమా నచ్చితే..మరో వర్గం ప్రజలకు ఈ సినిమా అస్సలు నచ్చలేదు. ముఖ్యంగా రొమాన్స్ మరీ ఓవర్ గా చూయించారు అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. అయితే డింపుల్ హయాతి నటనకు డ్యాన్స్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

అయితే , తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ హాట్ బ్యూటీ టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ పక్కన హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గోపీచంద్ త‌న 30వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శ్రీవాస్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అనౌన్స్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది. ఇక ఈ సినిమాలో డింపుల్ హయాతిని హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిందంటూ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో డింపుల్ హయాతి హీరొతో హాట్ సీన్స్ లో కూడా నటించే అవకాశాలు ఉన్నట్లు టాక్. పైగా ఇది వరకే ఈ డైరెక్టర్ తో గోఫీచంద్ లక్ష్యం, లౌక్యం లాంటి సినిమాలు చేసాడు. అన్ని మంచి విజయం అందుకున్నాయి. ఇక గోపీచంద్-శ్రీవాస్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం కావడంతో అభిమానులు ఎక్స్ పెక్టేషన్స్ భారీగానే పెట్టుకున్నారు. ఇక గోఫీచంద్ లాంటి ఆరు అడుగుల అందగాడి పక్కన డింపుల్ రొమాన్స్ చేస్తే బొమ్మ బద్దలవ్వాల్సిందే అంటున్నారు అభిమానులు..మరి చూడాలి ఈ సినిమా గోపీకి-డింపుల్ కి ఎలాంటి సక్సెస్ ను ఇస్తుందో..?