న‌వీన్ చంద్రకు పెళ్ల‌యిపోయిందా.. భార్య ఎంత అందంగా ఉందో చూశారా…!

టాలీవుడ్‌లో కొంద‌రు హీరోలు ముదురు వ‌య‌స్సువ‌చ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచిల‌ర్ లైఫ్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్ర‌భాస్ లాంటి హీరోలు 40కు చేరువ అయిపోయారు. ఇలాంటి హీరోల పెళ్లి ఎప్పుడు అవుతుందా ? అని యావ‌త్ సినీ అభిమానులు అంద‌రూ ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. అయితే కొంద‌రు హీరోలు మాత్రం స‌డెన్‌గా త‌మ భార్య‌ల‌ను ప‌రిచ‌యం చేస్తూ త‌మ‌కు పెళ్ల‌య్యింద‌ని ఒక్క‌సారిగా స‌డెన్ స‌ర్‌ఫ్రైజ్ ఇచ్చేస్తున్నారు. ఇలాండి షాకే ఇచ్చాడు యంగ్ హీరో న‌వీన్‌చంద్ర‌.

టాలీవుడ్ తెర‌కు అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయం అయిన నటుడు నవీన్‌ చంద్ర. న‌వీన్ చంద్ర – లావ‌ణ్య త్రిపాఠి హీరో, హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా హిట్ అవ్వ‌డంతో పాటు హీరోకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో న‌వీన్‌చంద్ర ఒక్క‌సారిగా ఓవ‌ర్ నైట్ స్టార్ అయ్యాడు. యూత్‌లో మంచి పాలోయింగ్ కూడా వ‌చ్చింది. ఇటీవ‌లే ప‌రంప‌ర వెబ్‌సీరిస్‌తో కూడా న‌వీన్‌చంద్ర మెప్పించాడు.

ఇక ప్ర‌స్తుతం అర‌వింద్ ద‌ర్శ‌క‌త్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. సినిమా లైఫ్‌ను కాసేపు ప‌క్క‌న పెడితే న‌వీన్‌చంద్ర ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి వార్త‌లు బ‌య‌ట‌కు రాలేదు. అయితే న‌వీన్‌చంద్ర ప్రేమికుల రోజు కానుక‌గా పెద్ద స‌డెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు. త‌న భార్య‌ను ఇన్‌స్టాలో ప‌రిచ‌యం చేసి అంద‌రికి షాక్ ఇచ్చాడు.

ప్రేమ ఎప్పుడూ గుండెల్లో ఉంటుంది. హ్యాపీ వాలెంటైన్స్‌ డే వైఫీ. నా బెటర్‌ హాఫ్‌ ఓర్మా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో భార్య‌తో క‌లిసి ఉన్న ఫొటో షేర్ చేశాడు. ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట్లో బాగా వైర‌ల్ అవుతోంది. అస‌లు న‌వీన్‌చంద్ర‌కు పెళ్లి ఎప్పుడు ? అయ్యింది ? అని అంద‌రూ షాక్ అవుతున్నారు. ఇక న‌వీన్ భార్య చాలా అందంగా ఉన్నారు అని కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. మ‌రికొంద‌రు ఈ బ్యూటిఫుల్ జంట‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.