హిమజ భర్తతో విడిపోతుందా? ఆమె చేసిన తాజా పని అదే చెప్తుందా?

వెండి తెర.. బుల్లితెర.. ఏ తెర అయితేనేం.. అంతా ఆ తాను ముక్కలే. ఈ గ్లామర్ ప్రపంచంలో ఎవరు.. ఎప్పుడు.. ఏం చేస్తారో చెప్పడం కష్టం. ఎవరితో కలిసి ఉంటారో? ఎవరితో డేటింగ్ చేస్తారో? ఎవరితో ప్రేమలో పడతారో? ఎవరితో పెళ్లి చేసుకుంటారో? ఎప్పుడు విడిపోతారో? చెప్పడం చాలా అంటే చాలా కష్టం. సోషల్ మీడియాలో సినీ, టీవీ తారలు చేసే ప్రతి యాక్టివిటీ జనాలకు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రస్తుతం బ్రేకప్పులు కాలం నడుస్తున్న తరుణంలో ఎవరు ఎవరిని అన్ ఫ్రెండ్ చేసినా.. ఎవరిని ఎవరో అన్ ఫాలో చేసినా.. ఎవరిని ఎవరు బ్లాక్ చేసినా.. అంతా అనుమానమే. ఎన్నో ప్రశ్నలకు కారణమే.

గతంలో సమంతా, నాగ చైతన్య మధ్య గ్యాప్ ఏర్పడిన సందర్భంలోనూ సోషల్ మీడియా వేదికగానే ఆ విషయం బయటకు తెలిసింది. సమంతా ఉన్నట్లుండి తన పేరులోని అక్కినేని అనే పదాన్ని తొలిగించింది. దీంతోనే వీరిద్దరి మధ్య ఏదో తేడా మొదలయ్యిందనే టాక్ మొదలయ్యింది. ఆ తర్వాత తను చైతన్యకు విడాకులు ఇచ్చింది. అలాగే శ్రీహాన్-సిరి, షణ్ముఖ్-దీప్తి, కల్యాణ్-శ్రీజ కూడా ఇలాంటి పనులే చేశారు. తాజాగా ఇదే లిస్టులో చేరింది హిమజ.

ఇప్పటికే బిగ్ బాస్ కు వెళ్లొచ్చిన ఈ అమ్మడు.. టీవీల్లోనూ సందడి చేస్తుంది. సొంతంగా ఓ యూట్యూబ్ చానెల్ కూడా రన్ చేస్తుంది. రకరకాల వీడియోలు పెడుతుంది. ఆమెకు ఇప్పటికే పెళ్లైంది. భర్త చల్లా విజయ్ రెడ్డి. ఇద్దరికీ ఇది తొలి పెళ్లి కాదు. ఎవరిది ఎన్నో పెళ్లి అనేది ఇప్పుడు అవసరం లేదు. కానీ తాజాగా ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. అది దేనికి సంకేతం? ఇద్దరు విడిపోతున్నారా? అవుననే అనే మాటలు వినిపిస్తున్నాయి. వాళ్లు అఫీషియల్ గా అయితే విడిపోతున్నట్లు చెప్పలేదు. కానీ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారంటే ఏదో తేడా మాత్రం కొడుతోంది. త్వరలో ఏదో విషయం బయటకు మాత్రం రానుంది.

Share post:

Latest