ఆ హీరోయిన్‌పైనే ఆశ‌ల‌న్నీ పెట్టుకున్న శ‌ర్వానంద్‌..కార‌ణం?!

టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్‌కు హిట్ ప‌డి చాలా కాల‌మే అయింది. ఈయ‌న న‌టించిన రణరంగం, జాను, శ్రీ‌కారం చిత్రాలు వ‌ర‌స‌గా బోల్తా ప‌డ్డాయి. ఇటీవ‌ల `మ‌హాస‌ముద్రం` మూవీతో శ‌ర్వా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్ మ‌రో హీరోగా న‌టించ‌గా.. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌లు హీరోయిన్లుగా న‌టించారు.

- Advertisement -

భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌ల ఈ మూవీ కూడా ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక‌తో క‌లిసి `ఆడవాళ్లు మీకు జోహార్లు` సినిమా చేస్తున్నాడు. కిషోర్‌ తిరుమల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్స్ రాధిక, కుష్బూ, ఊర్వశి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. అయితే ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న శ‌ర్వానంద్.. త‌న‌ ఆశ‌ల‌న్నీ ర‌ష్మిక‌పైనే పెట్టుకున్నాడ‌ట‌. ఎందుకంటే, `ఛలో` సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. కెరీర్ స్టార్టింగ్ నుండీ వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతూ ల‌క్కీ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది.

దీంతో ర‌ష్మిక ఉంటే ఆ సినిమా హిట్ అవ్వ‌డం ఖాయం అనే టాక్ వ‌చ్చేసింది. అందుకే ఈ బ్యూటీకి ఉన్న ల‌క్‌.. త‌న‌కు స‌క్సెస్‌ను ఇస్తుందేమో అని శ‌ర్వా ఆశ‌లు పెట్టుకున్న‌ట్లు టాక్‌. మ‌రి శర్వాకు ర‌ష్మిక హిట్ ఇస్తుందో.. లేదో..తెలియాలంటే మ‌రి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Share post:

Popular