వివాదంలో సమంత ఊ.. అంటావా మామ..సాంగ్.. రగులుతున్న అక్కినేని ఫ్యాన్స్..!

అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాలోని ‘ఊ..అంటావా మామ.. ఊఊ..అంటావా’ అనే సాంగ్ వివాదంలో చిక్కుకుంది. టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. సమంత విడాకుల తర్వాత వరుసగా సినిమాలకు ఓకే చెబుతూ దూసుకెళుతోంది. మరోవైపు విడాకుల తర్వాత వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వైవాహిక జీవితంలో తనకు జరిగిన అన్యాయంపై పరోక్షంగా వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలో పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు సమంత ఒప్పుకోవడం సంచలనంగా మారింది.

సమంత తాను హీరోయిన్ గా నటించిన చాలా సినిమాల్లో శ్రుతిమించి ఎక్స్ పోజింగ్ చేసిందనే విమర్శలు వచ్చాయి. అయితే తను నటించిన సినిమాల్లో మాత్రమే సమంత గ్లామర్ ఒలకబోసింది. స్పెషల్ సాంగ్ ఎప్పుడూ చేసింది లేదు. అయితే విడాకుల తర్వాత కెరీర్లోనే తొలిసారిగా స్పెషల్ సాంగ్ చేసేందుకు సమంత అంగీకరించింది. నిన్న ఈ పాటకు సంబంధించి వీడియో క్లిప్ విడుదలవ్వగా.. అందులో సమంత రెచ్చిపోయి ఎక్స్పోజింగ్ చేసింది. అయితే సమంత కావాలనే చైతన్యను రెచ్చగొట్టేందుకే ఇలా ఎక్స్పోజింగ్ చేస్తోందని అక్కినేని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

కెరీర్ లో స్పెషల్ సాంగ్ చేయడానికి ఎప్పుడు ఒప్పుకొని సమంత చైతన్య పై కోపంతోనే ఒప్పుకుందని వారు విమర్శిస్తున్నారు. దానికి తోడు స్పెషల్ సాంగ్ లో చైతన్యను టార్గెట్ చేసినట్లుగా సాహిత్యం కూడా ఉంది. ‘ పెద్ద మనిషి లాగా ఒకడు పోజులు కొడతాడు.మంచి మనసు ఉందని ఒకడు నీతులు చెబుతాడు. మంచి కాదు.. చెడ్డా కాదు..అంతా ఒకటే జాతి.. మగ బుద్ధే వంకర బుద్ధి.’ అంటూ సాగే సాహిత్యం నాగచైతన్యను ఉద్దేశించే రాసిందేనని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

అయితే మరికొందరు మాత్రం.. ఈ పాట రాసింది చంద్రబోస్ కాబట్టి సమంత,నాగ చైతన్య వివాదానికి ఆయనకు సంబంధం లేదని అంటున్నారు. క్యాజువల్ గా రాసిన దేనని కామెంట్స్ చేస్తున్నారు. సమంత, నాగచైతన్య ఇటీవలే విడిపోయారని.. పుష్ప సినిమా షూటింగ్ జరగబట్టే రెండేళ్లు గడిచిందని.. ఈ పాట రాసే సమయానికి వారిద్దరి మధ్య అసలు వివాదమే లేదని మరి కామెంట్స్ చేస్తున్నారు.