యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి డానయ్య నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడేదల కానుంది. ఈ నేపథ్యంలోజే ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. వరసగా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్, సాంగ్స్ ఇలా అన్నిటినికీ అదిరిపోయే రెస్పాన్ట్ రాగా.. ఇప్పుడు అందరి చూపు ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పైనే ఉంది.
అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ముంబైలో ఓ రేంజ్‌లో ప్లాన్ చేసిందట చిత్రబృందం. మరో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ ఈవెంట్‌కు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చీఫ్ గెస్ట్ గా రానున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం.
కాగా, పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లు కలిసి బ్రిటిష్ వారిపై ఏవిధంగా పోరాటం చేశారన్న కోణంలో ఫిక్షనల్ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించబోతున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రలు పోషించారు.