అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. త్రివిక్రమ్ తెరకెక్కించిన `అ ఆ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. తనదైన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. ఇక ఎక్స్‌పోజింగ్‌కు ఆమడ దూరంలో ఉండే హీరోయిన్లలో అనుపమా కూడా ఒకరు.
ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయి తరహా పాత్రలనే పోషించిన అనుపమ.. స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయినా తన కంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని ఎందరినో తన అభిమానులకు మార్చుకుంది. అయితే ఇప్పుడు ఆ అభిమానులకే అనుపమ సడెన్ షాక్ ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ బ్యూటీ పెళ్లి కూతురైంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యమా యాక్టివ్‌గా ఉండే అను.. పెళ్లి కూతురు దుస్తుల్లో అందంగా ముస్తాబైన పిక్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అనుపమని బ్రైడల్ లుక్‌లో చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. కొంపతీసి పెళ్లి చేసుకుంటుందా? ఏంటి అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పెళ్లి చేసుకుంటున్నావా… మేం తట్టుకోలేం, మా గుండె పగిలిపోతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, అనుపమ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ నిఖిల్ సరసన 18 పేజెస్, కార్తికేయ చిత్రాలను చేస్తోంది. అలాగే రౌడీ బాయ్స్ అనే మూవీలో అనుపమ నటిస్తోంది.
https://www.instagram.com/p/CXiFY-zJ5ki/?utm_source=ig_web_copy_link