భారీగా `పుష్ప` బిజినెస్‌.. హిట్ అవ్వాలంటే ఎంత రాబ‌ట్టాలో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌` నేడు విడుద‌లైంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ఫహాద్‌ ఫాజిల్, సునీల్ విల‌న్లుగా క‌నిపించ‌బోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమ‌వుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. మొద‌టి పార్ట్ పుష్ప ది రైజ్ నేడు ఏడు భాషల్లో రిలీజ్ అయింది.

తొలి షో కంటే ముందే ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ‌దైన శైలిలో రివ్యూలు ఇస్తున్నారు. ముఖ్యంగా బన్నీ కెరీర్‌లోనే ఇది బెస్ట్ ఫిలిం అవుతుందని, స్క్రీన్‌పై ఆయ‌న యాటిట్యూడ్ మ్యానరిజం పీక్స్‌లో ఉన్నాయని అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జ‌రిగింది.

పుష్ప‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా అన్ని ఏరియాల రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయట‌. తాజా స‌మాచారం ప్రకారం పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 144.90 కోట్లు బెజినెస్ చేసింద‌ని తెలుస్తుండ‌గా.. తెలుగులో రాష్ట్రాల్లోనే 101.75 కోట్లు బిజినెస్ జ‌రిగింద‌ట‌. ఏరియాల వారీగా ‘పుష్ప’ ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్క‌లు ఇలా ఉన్నాయి..

నైజాం: 36 కోట్లు, సీడెడ్: 18 కోట్లు, ఉత్తరాంధ్ర: 12.25 కోట్లు, తూర్పు గోదావరి: 8 కోట్లు, పశ్చిమ గోదావరి: 7 కోట్లు, గుంటూరు: 9 కోట్లు, కృష్ణా: 7.5 కోట్లు, నెల్లూరు: 4 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 101.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలిసింది. అలాగే కర్ణాటకలో 9 కోట్లు, తమిళనాడులో 6 కోట్లు, కేరళలో 4 కోట్లు, హిందీలో 10 కోట్లు, ఓవర్సీస్‌లో 13 కోట్ల‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 144.90 కోట్ల బిజినెస్ చేసింది. దీంతో ఇప్పుడీ సినిమా సూప‌ర్ హిట్ అవ్వాలీ అంటే రూ.146 కోట్లను రాబ‌ట్టాల్సి ఉంది. మ‌రి భారీ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన బ‌న్నీ స‌క్సెస్ అవుతాడో..లేదో.. చూడాలి.