`పుష్ప` సెకండ్ పార్ట్ టైటిల్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌గా..ఫహాద్‌ ఫాజిల్, సునీల్ విల‌న్లు క‌నిపించ‌బోతున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే మొద‌టి పార్ట్ `పుష్ప ది రైజ్‌` టైటిల్‌తో నేడు తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ భాస‌ల్లో అట్ట‌హాసంగా విడుద‌లైంది. ఇప్ప‌టికే ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్, ఓవర్సీస్ పబ్లిక్ సినిమాపై తమ తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు అల్లు అర్జున్‌ నటనే హైలెట్ అని, యాక్షన్‌ సీన్స్‌ అదిరిపోయాయ‌ని, అలాగే మాస్ ప్రేక్ష‌కులు సుకుమార్ ఫుల్ మీల్స్ పెట్టేశాడ‌ని అంటున్నారు.

ఇక ఫ‌స్ట్ పార్ట్ గురించి ప‌క్క‌న పెడితే.. ఇప్పుడు పుష్ప సెకండ్ పార్ట్ కు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఈ సినిమా ఫ‌స్ట్ పార్ట్‌కి పుష్ప ది రైజ్ అని టైటిల్ పెట్ట‌గా.. సెకండ్ పార్ట్‌కు ఏ పేరు పెడతారో అని బన్నీ అభిమానులు, సినీ ప్రేక్షకుల్లో ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ విష‌యంపై తాజాగా క్లారిటీ వ‌చ్చేసేంది. పుష్ప సెకండ్‌ పార్ట్‌కు `పుష్ప: ది రూల్‌` అని టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విష‌యాన్ని సుకుమార్ ఫ‌స్ట్ పార్ట్ చివ‌ర్లో తెలియ‌జేశాడు. మ‌రి పుష్ప ది రైజ్‌తోనే మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న బన్నీ.. సెకండ్‌ పార్టులో తన రూలింగ్‌తో సినిమాను ఏ రేంజ్‌కి తీసుకెళ్తాడో చూడాలి.