టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తుండగా.. ఫస్ట్ పుష్ప ది రైజ్ నేడు సౌత్ భాషలతో పాటుగా హిందీలోనూ గ్రాండ్‌గా విడుదలైంది. ఇక ఈ సినిమా కోసం నిద్రహారాలు మాని గురువారం మధ్యాహ్నం వరకూ పని చేస్తూనే ఉన్న సుకుమార్.. నిన్న సాయంత్రం మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ ప్రెస్ మీట్‌లో సినిమా గురించి అనేక విషయాలను షేర్ చేసుకున్న సుకుమార్.. షూటింగ్ తొలి రోజుల్లో పుష్పకు పని చేసిన కెమెరామెన్‌తో జరిగిన గొడవను కూడా అందరితోనూ పంచుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ సినిమాకు పోలాండ్‌కి చెందిన పాపులర్ సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబా బ్రోజెక్ కెమెరా వర్క్ చేశాడు. కూబాకు పాష్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటాడు.
అందువల్ల అతడు ఏం మాట్లాడేవాడో సుకుమార్‌కు సరిగ్గా అర్థం అయ్యేది కాదట. ఆ మిస్ అండర్‌స్టాండింగ్ వల్లే కుబా, సుక్కూల మధ్య పెద్ద గొడవకి దారితీసిందట. షూటింగ్ మొదలు పెట్టిన కొత్తలో కుబాకు ఓ సీన్ గురించి వివరించి ఆపై కెమెరా లెన్స్ లు ఛేంజ్ చేయాలని తెలుపుతూ `ఛేంజ్ లెన్స్` అన్నారట సుకుమార్. దానికి కుబా రియాక్ట్ అవుతూ చెంజ్‌లెన్స్ ని పాష్‌గా అనడంతో సుకుమార్‌కి అది సెన్స్‌లెస్‌గా వినిపిస్తుందట.
ఆ తర్వాత కూడా కుబా ఛేంజ్ లెన్స్ అని అంటుంటే సుకుమార్ కు మాత్రం సెన్స్ లెస్‌గా వినిపిస్తుందట. దాంతో ఆగ్రహానికి గురైన సుకుమార్.. కుబాను అందరి ముందు `నేనంటే ఏమనుకుంటున్నావు.. నేనెలాంటి సినిమాలు తీశానో తెలుసా? నా సినిమాలసలు చూశావా` అంటూ చెడా మడా తిట్టి ఘోరంగా అవమానించారట.
దాంతో కుబా కళ్లల్లో నీళ్లు తిరిగాయట. అయితే కొద్ది సేపటి తర్వాత సుకుమార్ కార్వాన్ వద్దకి వెళ్లిన కుబా.. తన బాధని వ్యక్తం చేశాడట. తాను ఛేంజ్ లెన్స్ అనే అన్నానని.. దాన్ని మీరు సెన్స్ లెస్‌గా అర్థం చేసుకున్నారని వివరించాడట. అప్పుడు తప్పు తెలుసుకున్న సుకుమార్.. అతడికి క్షమాపణ చెప్పాడట. ఇక ఆ తర్వాత తమ మధ్య ఎలాంటి గొడవా రాలేదని.. ఎంతో ఫ్రెండ్లీగా పని చేశామని తాజా ఇంటర్వ్యూలో సుక్కూ తెలిపాడు.