ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించబోతున్నాడు. సునీల్, అనసూయ, ప్రకాశ్ రాజ్‌లు కీలక పాత్రలను పోషిస్తున్నారు.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్` డిసెంబర్ 17న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే పుష్ప ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఇలా అన్ని అదిరిపోగా.. ఇప్పుడీ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం ఇప్పటి వరకు తెలుగు, తమిళ, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో థియేట్రికల్, నాన్ థియేట్రికల్ (ఓటిటి, డిజిటిల్ రైట్స్) కలుపుకొని రూ. 250 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ అయినట్లుగా తెలుస్తోంది. బన్నీ-సుకుమార్ కాంబినేషన్‌కి హ్యాట్రిక్ మూవీ కావడం, మరియు వీరిద్దరూ వరుస హిట్లతో జోరు మీద ఉండడంతో.. పలు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఎగబడి పుష్ప రైట్స్ దక్కించుకుంటున్నట్టు సమాచారం.
దీంతో అన్ని ఏరియాల్లోనూ పుష్ప ఫ్యాన్సీ రేటుకి అమ్ముడు పోయిందని టాక్. మొత్తానికి బిజినెస్ పరంగానూ బన్నీ తగ్గేదెలే అని నిరూపించుకున్నాడు. కాగా, డిసెంబర్ 12న పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ యూసఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరగబోతోంది. అయితే స్పెషల్ గెస్ట్ లేకుండా ఈ ఈవెండ్ జరగడం విశేషం.