పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈయన చేస్తున్న తాజా చిత్రాల్లో `ప్రాజెక్ట్-కె` ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ వరల్ట్ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ లేడీ దీపికా పదుకొనె హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు.
ఇప్పటికే ఒక షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ పునః ప్రారంభమైంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీగా వేసిన సెట్లో చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవల దీపికా సెట్లో అడుగు పెట్టగా.. నేటి నుంచి హీరో ప్రభాస్ కూడా షూటింగ్ జాయిన్ అయ్యారు. హీరోహీరోయిన్లపై పలు కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.
అయితే ప్రభాస్-దీపికాలపై తీసిన ఫస్ట్ షాట్ క్లిప్‌ను చిత్ర యూనిట్ తాజాగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఈ వీడియోలో దర్శకుడు రోల్ కెమెరా స్టార్ట్ అనడంతో.. ప్రభాస్ తన చేయి ఇస్తాడు. అప్పుడు వెంటనే ఆయనకు కింద నుంచి దీపికా పదుకొనె చేయి అందివ్వడం వీడియోలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
కాగా, సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని అశ్వనీదత్ 500 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మిక్కి జే మేయర్ ఈ మూవీకి సంగీతం అందించనున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం వచ్చే ఏడాది చివర్లో లేదా ఆ తర్వాత ఏడాది మొదట్లో విడుదల కానుంది.
𝑰𝒏𝒅𝒊𝒂'𝒔 𝒃𝒊𝒈𝒈𝒆𝒔𝒕 𝒔𝒖𝒑𝒆𝒓𝒔𝒕𝒂𝒓𝒔 #Prabhas & @deepikapadukone 𝒋𝒐𝒊𝒏 𝒉𝒂𝒏𝒅𝒔 𝒐𝒏 𝒕𝒉𝒆 𝒘𝒐𝒓𝒍𝒅'𝒔 𝒃𝒊𝒈𝒈𝒆𝒔𝒕 𝒄𝒂𝒎𝒆𝒓𝒂… #ProjectK @SrBachchan @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/nRjsJYVMDc
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) December 11, 2021