త్వ‌ర‌లో పెళ్లి.. ఈలోపే మ‌రో గుడ్‌న్యూస్ చెప్పిన న‌య‌న‌తార‌!

సౌత్ ఇండియా లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గ‌త కొన్నేళ్ల నుంచి కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివన్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లె గ‌ప్‌చ‌ప్‌గా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట‌.. త్వ‌ర‌లోనే అంగ రంగ వైభ‌వంగా పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఏడాది వీరి వివాహం జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయి.

అయితే ఈలోపే త‌న ఫ్యాన్స్‌కు ఓ గుడ్‌న్యూస్ చెప్పింది న‌య‌న‌తార‌. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. తాజాగా ఈ బ్యూటీ ఓ కొత్త బిజినెస్‌లోకి అడుగు పెట్టింది. `ది లిప్ బామ్ కంపెనీ` పేరుతో రీటైల్ బ్రాండ్ ను లాంచ్ చేసింది. ఎంతో నైపుణ్యం కలిగిన మ‌రియు సైన్స్ పై మంచి అవగాహన కలిగిన డాక్టర్‌ రాజన్‌తో కలిసి ఈ బిజినెస్ ను ఆమె ప్రారంభించింది.

త‌న బ్రాండ్ పేరు మీద లిప్‌బామ్‌కి సంబంధించి కలెక్షన్స్ ని మార్కెట్‌లోకి తీసుకురాబోతుందట. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలిపిన న‌య‌న‌తార‌.. `నా చర్మ సంరక్షణ కోసం సరైన ప్రొడక్ట్ లను ఉపయోగించే విషయంలో రాజీపడను. నా పర్సనల్‌ కేర్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. అలాగే ఈ లిప్‌బామ్‌ కంపెనీ అదే డీఎన్‌ఏ విలువలను ఇన్‌కార్పోరేట్‌ చేస్తుంది. డాక్టర్‌ రాజన్‌తో చేతులు కలపడం సంతోషంగా ఉంది` అంటూ చెప్పుకొచ్చింది.

దీంతో అభిమానులు న‌య‌న్‌కు బెస్ట్ విషెస్ తెలియ‌జేస్తున్నారు. కాగా, న‌య‌న‌తార సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈ భామ చిరంజీవితో `గాడ్‌ఫాదర్‌`, కాబోయే భ‌ర్త విఘ్నేష్ ద‌ర్శ‌క‌త్వంలో `కాతు వాకుల రెండు కాదల్‌` చిత్రాలు చేస్తోంది. అలాగే వీటితో పాటు `క‌నెక్ట్‌`, `గోల్డ్` త‌దిత‌ర చిత్రాల్లోనూ న‌య‌న న‌టిస్తోంది.