`ఆర్ఆర్ఆర్` ప్రెస్‌మీట్‌లో ఎన్టీఆర్ ధ‌రించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా?

రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అలియా భ‌ట్‌, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించారు. అజ‌య్ దేవ్గ‌న్‌, శ్రీయ‌లు కీల‌క పాత్ర‌లు పోషించారు.

స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థ రూపుదిద్దుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జనవరి 7న మొత్తం 10 భాషలలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ టీమ్‌ భారీ లెవల్‌లో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ప్రెస్ మీట్‌ ఏర్పాటు చేసిన చిత్రబృందం.. `ఆర్ఆర్ఆర్` సినిమా గురించి ఎన్నో విషయాలను పంచుకుంటున్నారు.

అయితే ఈ ప్రెస్ మీట్‌లో ఎన్టీఆర్ ధ‌రించిన వాచ్ ధ‌ర ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. రిచర్డ్ మిల్లె rm 011 కార్బన్ Ntpt గ్రోస్జీన్ రోజ్ గోల్డ్ లోటస్ F1 టీమ్ లిమిటెడ్ ఎడిషన్ వాచ్ అది. ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన వాచ్ లలో ఇది ఒక‌టి కాగా.. దీని ధర అక్షరాల రూ.4 కోట్లు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఈ నేప‌థ్యంలోనే ఎన్టీఆర్ ధ‌రించిన వాచ్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

కాగా, ఎన్టీఆర్ సినిమాల విష‌యానికి వ‌స్తే ఆర్ఆర్ఆర్ త‌ర్వాత.. కొర‌టాల శివ‌తో త‌న 30వ చిత్రాన్ని ప్ర‌క‌టించాడు. పాన్ ఇండియా లెవ‌ల్‌లో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఇక ఈ సినిమా పూర్తి అయిన త‌ర్వాత ఎన్టీఆర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు.