అల్లు అర్జున్ -సుకుమార్ -దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే స్పెషల్ సాంగ్ కు పెట్టింది పేరు. వీరి ముగ్గురి కాంబినేషన్ లో మొట్టమొదట వచ్చిన స్పెషల్ పాట.. ఆ అంటే అమలాపురం..ఆర్య సినిమా లోని ఈ పాట అప్పట్లో మాస్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. బన్నీకి డాన్సర్ గా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన ఆర్య 2 సినిమా లో రింగ రింగా రింగ రింగా.. అనే పాట కూడా ఊపేసింది.
ఇప్పుడు ముచ్చటగా వీరి ముగ్గురి కాంబినేషన్ లో పుష్ప అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా సుకుమార్ ఓ స్పెషల్ సాంగ్ కు ప్లాన్ చేశారు. ఆ సాంగ్ కోసం ప్రత్యేకంగా స్టార్ హీరోయిన్ సమంతను కూడా తీసుకున్నారు. నిన్న సాయంత్రం ఈ స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియో విడుదలైంది.
ఊ.. అంటావా.. మామ. ఉ..ఊ.. అంటావా మావ.. అంటూ..సాగే ఈ పాట మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాట విడుదలైన 18 గంటల్లోనే రికార్డు స్థాయిలో టెన్ మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది అంటే ఈ పాటకు వస్తున్న ఆదరణ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది.ఈ సాంగ్ లో సమంత సెక్సీ లుక్స్ తో ఊపేస్తోంది. రంగస్థలం సినిమాలో రంగమ్మ మంగమ్మ అనే పాటతో డాన్స్ ఇరగదీసిన సమంత.. పుష్పలోని స్పెషల్ సాంగ్ లో ఏ రేంజ్ లో ఊపేస్తుందో చూడాల్సి ఉంది.