ప్ర‌ముఖ ఓటీటీకి `పుష్ప‌`.. రిలీజ్ డేట్ ఇదేన‌ట‌…?!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌` నిన్న గ్రాండ్‌గా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై నవీన్‌ యెర్నేని, వై.రవి శంకర్ లు నిర్మించారు. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించగా.. సునీల్‌, మ‌ల‌యాళ హీరో ఫహాద్‌ ఫాజిల్ విల‌న్లుగా క‌నిపిస్తారు.

ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రెండు భాగాలుగా ఈ చిత్రం రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ పుష్ప ది రైజ్ నిన్న రిలీజై మాస్ ప్రేక్ష‌కుల‌కు ఫుల్ మీల్స్ పెట్టేస్తోంది. ప్ర‌స్తుతం తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతోంది. ఇక మ‌రోవైపు ఈ సినిమా ఓటీటీలో వ‌చ్చేది ఎప్పుడా..? అనే చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి.

అయితే వినిపిస్తున్న తాజా స‌మాచారం ప్ర‌కారం.. పుష్ప స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకు ద‌క్కించుకుంద‌ట‌. సాధారణంగా పెద్ద సినిమా రిలీజ్ అయిన నాలుగు లేదా ఆరు వారాల తర్వాత ఓటీటిలో వచ్చేలా ఎగ్రిమెంట్ చేసుకుంటారు. అయితే పుష్ప‌ను నాలుగు వారాల త‌ర్వాత అంటే జ‌న‌వ‌రి 14న అమెజాన్ ప్రైమ్ రిలీజ్ చేయ‌నుండ‌ని టాక్‌.

మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే. కాగా, దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో పుష్ప‌రాజ్‌గా మాస్‌లుక్‌లో బన్నీ అదరగొట్టేశాడు. చిత్తూరు యాసలో ఆయన పలికే డైలాగ్స్ ఆక‌ట్టుకున్నాయి. మ‌రోవైపు శ్రీ‌వ‌ల్లిగా ర‌ష్మిక త‌న పాత్ర‌కు న్యాయం చేసింది.

Share post:

Latest