రిలీజైన రెండు గంటల్లోనే ‘దాక్కో దాక్కో మేక ‘ ఫుల్ వీడియో సాంగ్ వైరల్..!

అల్లు అర్జున్- సుకుమార్ -రష్మిక మందన్న కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా పుష్ప. ఈనెల 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీసు వద్ద భారీగా వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాది రాష్ట్రాలు, ఓవర్సీస్ లోనూ పుష్ప సినిమా సత్తా చాటుతోంది. కేరళ, బాలీవుడ్ లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తోంది. సినిమా సూపర్ హిట్ గా నిలవడం తో చిత్ర యూనిట్ వరుసగా సక్సెస్ మీట్లు నిర్వహిస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మూవీ మేకర్స్ తొలి వీడియో సాంగ్ ను యూట్యూబ్ లో విడుదల చేశారు. దాక్కో దాక్కో మేక అంటూ సాగే వీడియో పాటను ఇవాళ ఉదయం విడుదల చేశారు. కాగా ఈ వీడియో సాంగ్ విడుదలైన కొన్ని గంటల్లోనే వైరల్ గా మారింది. యూట్యూబ్లో అప్లోడ్ చేసిన గంటకే ఈ పాట ఆఫ్ మిలియన్ వ్యూస్ పైగా దక్కించుకుంది. పుష్ప సినిమా నుంచి విడుదలైన తొలి ఆడియో సాంగ్ కూడా ఇదే. ఈ పాట అభిమానులకు విపరీతంగా నచ్చింది.

యూట్యూబ్ లో ఈ పాట రికార్డుల మోత మోగిస్తూ హండ్రెడ్ మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. కాగా ఈ సినిమా నుంచి తొలి వీడియో సాంగ్ గా కూడా దాక్కో దాక్కో మేక పాటనే యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ పాటతో పాటు సామి నా సామి, శ్రీవల్లి, ఊ..అంటావా మావా.. ఉ.. ఊ.. అంటావా పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. కాగా పుష్ప సినిమాను మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించాయి.