ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. రష్మిక మందన్నా హీరోయిన్‌గా మెరిసిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, టాలీవుడ్ నటుడు సునీల్ విలన్ పాత్రల్లో నటించారు. అలాగే ప్రకాష్ రాజ్, ధనంజయ్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలను పోషించగా దేవి శ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం సమకూర్చారు.
మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ పుష్ప ది రైజ్ డిసెంబర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. టాక్ ఎలా ఉన్నప్పటికీ ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల భారీ కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతోంది.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా బన్నీ వన్ మ్యాన్ షో చేసి మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరించాడు. మాస్ లుక్‌లోనే కాదు నటనలోనూ అల్లు అర్జున్ అదరగొట్టేశాడు
ఇకపోతే తాజాగా మైత్రీ మేకర్స్ వారు.. పుష్ప డిలీటెడ్ సీన్ పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు. ఆకట్టుకున్న ఈ వీడియో ప్రస్తుతం అందరి చేత నువ్వులు పూయిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం `పుష్ప` డిలీటెడ్ సీన్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.