వంద కోట్లా.. నాకా.. రెమ్యునరేషన్ పై రామ్ చరణ్ క్లారిటీ..షాక్ లో ఫ్యాన్స్..!

రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయి హీరోలుగా మారనున్నారు రామ్ చరణ్, ఎన్టీఆర్. ఈ సినిమా ద్వారా వచ్చే ఇమేజ్ కు అనుగుణంగా తమ తదుపరి సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉండే విధంగా ఈ హీరోలు ప్లాన్ చేసుకుంటున్నారు. రామ్ చరణ్ ఇప్పటికే ఇండియాలోనే దిగ్గజ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శంకర్ తో ఒక సినిమాను స్టార్ట్ చేశాడు. అలాగే యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరో యాక్షన్ మూవీ చేయనున్నారు.

అయితే ఆర్ఆర్ఆర్ తో తనకు వచ్చే క్రేజ్ కు అనుగుణంగా రామ్ చరణ్ తన పారితోషికాన్ని రూ.వంద కోట్లకు పెంచినట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. తన తదుపరి ప్రాజెక్టులకు చరణ్ రూ.వంద కోట్లు తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై తాజాగా చరణ్ క్లారిటీ ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో భాగంగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తన పారితోషికం గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని చరణ్ వివరించాడు.

అసలు రూ.100 కోట్లు ఎక్కడ ఉన్నాయి? ఉన్నా నాకు ఎవరు ఇస్తారు? అని చరణ్ తిరిగి ప్రశ్నించాడు. తాను రూ.వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలని పుకార్లేనని చరణ్ కొట్టిపారేశాడు. చరణ్ ఇచ్చిన క్లారిటీ తో మెగా ఫ్యాన్స్ షాక్ లో గురయ్యారు. తమ హీరో గ్లోబల్ స్టార్ ప్రభాస్ తో సమానంగా రూ. వంద కోట్ల హీరోగా అవతరించాడని గొప్పలు చెప్పుకుంటున్న ఫ్యాన్స్ కు చరణ్ ఇచ్చిన క్లారిటీతో దిమ్మతిరిగిపోయింది. కాగా చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ జనవరి 7వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.