సీనియ‌ర్ ఎన్టీఆర్ తిండి చూసి షాక్ అయిన స్టార్ హీరోయిన్‌..!

ఇప్పుడు అంటే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. సినిమా షూటింగ్ చకచక జరుగుతోంది. ఒక పెద్ద స్టార్ హీరో సినిమా కూడా మూడు నాలుగు నెలల్లో పూర్తి చేసేయొచ్చు. ఒకప్పుడు సినిమా షూటింగ్ లు రోజులతరబడి జరిగేవి. నటీనటులంతా కలిసి పని చేసేవారు. అయితే అప్పట్లో ఇప్పుడు ఉన్నంత సౌకర్యాలు లేవు. హీరో.. హీరోయిన్లు ఒకే చోట ఉండాల్సి వచ్చేది. అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నే సర్దుకుపోవాల్సి వచ్చేది. షూటింగ్ సమయంలో టిఫిన్లు – భోజనాలు కూడా అందరూ కలిసి కూర్చుని చేసేవారు. ఎంత పెద్ద హీరో.. హీరోయిన్… దర్శకుడు అయినా కూడా సినిమాలో పనిచేసే టెక్నీషియన్ల‌తో కలిసి భోజనం చేయడం అప్పట్లో ఆనవాయితీగా ఉండేది.

ఇక సీనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే సెట్లో పెద్ద కోలాహలం ఉండేది. ఆయన భోజనప్రియుడు అన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన భోజనం చేయాలంటే కనీసం పది రకాల ఫుడ్ ఐట‌మ్స్‌ ఉండేవట. ఎన్టీఆర్ ఎంత తిన్నా కూడా ఆరగించుకునే శ‌క్తి ఆయనకు ఉండేది. ఆయన తిండి గురించి అప్పట్లో పలువురు రకరకాలుగా అనుకునేవారు. అప్పట్లో హీరోయిన్ గా పరిచయమైన వాణిశ్రీ కూడా ఎన్టీఆర్ తిండి గురించి రకరకాలుగా వినేవారట.

ఒకసారి ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న సమయంలో స్వయంగా ఆయన భోజనం చూసి షాక్ అయిపోయిందట. ఎన్టీఆర్‌కు ప్రతి రోజూ ఇంటి నుంచి రెండు క్యారేజీలు వచ్చేవట. ఆ రెండూ కూడా చాలా పెద్దవిగా ఉండేవని వాణిశ్రీ ఓ సందర్భంలో చెప్పింది. ఒక రోజు ఎన్టీఆర్ రెండు క్యారేజీల్లో వచ్చిన భోజనం చకచకా తింటుంటే… వాణిశ్రీ ఆయన వైపు కన్నార్పకుండా చూస్తూ ఉండటం… అది చూసిన ఎన్టీఆర్ వాణిశ్రీ గారు మా భోజనం రుచి చూస్తారా ? అంటూ తన క్యారేజీలోని వంటకాలను స్వయంగా ఆమెకు వ‌డ్డించ‌డం జ‌రిగాయ‌ట‌.

ఆ రోజు తన జీవితంలో మర్చిపోలేని వాణిశ్రీ చెప్పింది. ఎన్టీఆర్ ఉదయాన్నే 20 ఇడ్లీలు తినేవారట. పెరుగు అన్నం ఎన్టీఆర్ కు ఎంతో ఇష్టం. అలాగే ప్రతి రోజూ 5 లీటర్ల జ్యూస్ తాగేవారట. ఆయన ఫుడ్ మెనూలో లో డ్రై ఫ్రూట్స్‌తో పాటు బాదంపాలు సమ్మర్ లో మామిడి పండ్లు – గ్లూకోజ్ పౌడర్ – అల్లం వెల్లుల్లి ముద్ద ఉండేవట.