ఆర్ఆర్ఆర్ విడుదలకు బ్రేక్ …. రాజమౌళి ఫైర్..!

రాజమౌళి -రామ్ చరణ్ -ఎన్టీఆర్ కాంబినేషన్ లో పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలకానుంది. ఇప్పటికే రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తిరుగుతూ ప్రమోషన్లు జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. అయినా ఈ సినిమా జనవరి 7వ తేదీన విడుదల అవుతుందా.. లేదా..అనే సందేహం మాత్రం వీడటం లేదు. దీనికి కారణం ఒమిక్రాన్. ప్రస్తుతం ఒమిక్రాన్ వైరస్ దేశంలోని 21 రాష్ట్రాల్లో వ్యాప్తి చెందింది.

మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వైరస్ నియంత్రణకు ఇప్పటికే ఆంక్షలు విధించడం మొదలైంది. చాలా రాష్ట్రాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం వరకు కర్ఫ్యూ విధిస్తున్నారు. థియేటర్ల పై ఆంక్షలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా వేయడం తధ్యమనే ప్రచారం జోరుగా నడుస్తోంది. తాజాగా దీనిపై ఒక క్లారిటీ వచ్చింది.

ఈ సినిమా విడుదల వాయిదా వేయడంపై రాజమౌళి తనకు క్లారిటీ ఇచ్చినట్లు ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఒక ట్వీట్ చేశారు. ఆర్ఆర్ఆర్ కచ్చితంగా జనవరి 7వ తేదీన విడుదలవుతుందని, వాయిదా వేసే ప్రసక్తి లేదని రాజమౌళి తనతో చెప్పినట్లు తరుణ్ ఆదర్శ్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. ఆర్ఆర్ఆర్ అనుకున్న సమయానికి విడుదల కానుండటంతో మెగా, నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.