నాగ చైతన్య.. అక్కినేని వారసుడిగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత జోష్ చిత్రంతో మొదటిసారి డెబ్యూ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అంతే కాదు తండ్రికి తగ్గట్టుగా ఎన్నో సినిమాలలో నటించినా.. ఆయనకు తగ్గట్టు అయితే గుర్తింపు తెచ్చుకోలేక పోయాడు. ఇక మొన్నటికి మొన్న ప్రముఖ ఫ్యామిలీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా ద్వారా తన సినీ కెరీర్ లోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు నాగచైతన్య . ఇకపోతే తన భార్య అయిన అక్కినేని సమంత నుంచి విడాకులు తీసుకుందామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ఆయన తన వ్యక్తిగత విషయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే తన తండ్రి నాగార్జునతో కలిసి బంగార్రాజు సినిమాలో నటిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ప్రముఖ నటి రాజశ్రీ నాయర్ నాగచైతన్య గురించి కొన్ని షాకింగ్ నిజాలు వెల్లడించింది.. ఆమె ఇంటర్వ్యూ ద్వారా మాట్లాడుతూ.. నాగచైతన్య కూడా అలాంటి వాడే ఎంతో గొప్ప మనసున్న వాడు ఆయనతో ఆయన భార్యతో కలిసి నేను మజిలీ సినిమాలో నటించాను.స్వీట్ హార్ట్ ఉన్న వ్యక్తి నాగచైతన్య అని రాజశ్రీ నాయర్ అన్నారు.నాగచైతన్య డౌన్ టు ఎర్త్ ఉంటారని.. అందరితో చక్కగా కలిసిపోయే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, ఎవరి దగ్గరా దురుసుగా మాట్లాడే స్వభావం ఆయనది కాదు అని రాజశ్రీ నాయర్ వెల్లడించారు. మజిలీ సమయంలో ఇద్దరూ కలిసి పని చేయడం నాకు చాలా సంతోషంగా అనిపించిందని.. ఆ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయని రాజశ్రీ నాయర్ చెప్పుకొచ్చారు. ఇక విడాకుల వార్త విని తాను చాలా ఫీల్ అయ్యానని రాజశ్రీ నాయర్ వెల్లడించారు.
రాజశ్రీ ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. మజిలీ సినిమాలో సమంత కి తల్లి పాత్రలో నటించింది.