మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మరో హీరోగా ఎన్టీఆర్ నటించారు. ఆర్ఆర్ఆర్ జనవరి 7వ తేదీన విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకముందే చరణ్ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమా ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది.
ఈ మూవీ ఇలా ఉండగానే మరో సినిమాను లైన్లో పెట్టనున్నాడు చరణ్. శంకర్ సినిమాతో పాటు యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామా కథాంశంతో జెర్సీ సినిమాతో హిట్ కొట్టిన గౌతమ్ చరణ్ తో కూడా ఒక స్పోర్ట్స్ మూవీ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది.
అయితే దీనిపై ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్ మాట్లాడుతూ చరణ్ తో చేసేది స్పోర్ట్స్ మూవీ కాదు అని క్లారిటీ ఇచ్చాడు. చరణ్ తో యాక్షన్ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ పాన్ సినిమా ఇండియా స్థాయికి మించి ఉంటుందని తెలిపాడు. అలాగే ఈ సినిమాలో చిరంజీవి కూడా నటిస్తున్నట్లు వస్తున్న వార్తలపై కూడా గౌతమ్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో చిరంజీవి నటించడం లేదంటూ స్పష్టం చేశాడు. ఇప్పటికే చరణ్ ఎన్నో యాక్షన్ మూవీస్ లో కనిపించాడు. మరి గౌతమ్ చరణ్ ను ఏ విధంగా ప్రజెంట్ చేస్తాడో వేచి చూడాలి.