ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా తొలి సారి జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్లు పాన్ ఇండియా లెవల్లో నిర్మించారు. అలాగే రెండు పార్టులుగా ఈ చిత్రం రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్` డిసెంబర్ 17న తెలుగుతో పాటుగా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న మేకర్స్.. ఇటీవల ఈ సినిమాలోని `ఊ అంటావా మావా… ఊఊ అంటావా మామా` అంటూ సాగే మాస్ మసాలా ఐటెం సాంగ్‌ని విడుదల చేశారు. ఈ సాంగ్‌లో ఇంద్రావతి చౌహాన్ వాయిస్.. చంద్రబోస్ లిరిక్స్.. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్.. సమంత అదిరిపోయే స్టెప్పులు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి.
దీంతో ప్రస్తుతం ఈ సాంగ్ మిలియన్స్ వ్యూస్‌తో నెట్టింట దూసుకుపోతోంది. మరోవైపు ఈ సాంగ్‌పై పలు వివాదాలు కూడా చెలరేగాయి. ముఖ్యంగా మగావాళ్లను తప్పుగా చూపించేలా ఈ సాంగ్ లిరిక్స్ ఉన్నాయంటూ పురుషుల సంఘం కోర్టులో కేసు వేశారు. ఇక ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే.. ఈ సాంగ్ ఖర్చుకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
వినిపిస్తున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం.. సమంత చేసిన ఈ ఐటెం సాంగ్‌కి సుకుమార్ ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ. 5 నుంచి 6 కోట్ల వరకు ఖర్చు పెట్టాడట. అందులో కోటిన్నరను సమంత రెమ్యూనరేషన్‌గా తీసుకోగా.. మిగిలింది సెట్టింగ్స్, కాస్ట్యూమ్స్ మరియు ఇతరితర వాటి కోసం వెచ్చించారని తెలుస్తోంది. ఏదేమైనా ఒక్క సాంగ్ కోసం సుకుమార్ ఈ రేంజ్లో ఖర్చు చేయడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.