సాధారణంగా కథ విని సినిమా సూపర్ హిట్ అవుతుందని ముందే ఊహించగలిగితే.. ఏ హీరో అయినా, హీరోయిన్ అయినా ఆ మూవీని వదిలి పెట్టడానికి అస్సలు ఇష్టపడరు. కానీ, న్యాచురల్ నాని మాత్రం పక్కా హిట్ అని ముందే తెలిసినా పలు చిత్రాలను వదిలేసుకున్నాడట. మరి ఆ చిత్రాలు ఏంటీ..? ఆయన ఎందుకు వదిలేశాడు..? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అట్లీ దర్శకత్వంలో ఆర్య- జై హీరోలుగా, నయనతార-నజ్రియా నజీం హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం `రాజా రాణి`. తమిళంలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేయగా.. ఇక్కడా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాలో ఒక హీరోగా నాని తీసుకోవాలనుకున్నారట. ఈ నేపథ్యంలోనే ఆయన్ను సంప్రదించి కథ చెప్పారట. కథ విన్న నాని సినిమా మంచి విజయం సాధిస్తుందని ముందే ఊహించారట. కానీ, ఆ సమయంలో డేట్స్ కుదరకపోవడం వల్ల నాని రాజా రాణి చిత్రాన్ని వదిలేశారు.
అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన `ఎఫ్ 2` చిత్రం 2019లో విడుదలై సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోనూ ఒక హీరోగా నానిని ఎంచుకున్నాడట అనిల్ రావిపూడి. అయితే ఈ సినిమా సైతం హిట్ అవుతుందని తెలిసినా నాని ఇతర ప్రాజెక్ట్‌ల కారణంగా వదులు కోవాల్సి వచ్చింది.
కాగా, నాని సరైన హిట్ కొట్టి చాలా కాలమే అయింది. ఈ మధ్య ఓటీటీ వేదికగా విడుదలైన వి, టక్ జగదీష్ చిత్రాల రెండూ ప్రేక్షకులను నిరాశే పరిచయాయి. ప్రస్తుతం నాని ఆశలన్నీ శ్యామ్ సింగరాయ్పైనే ఉన్నాయి. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 24న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటించారు.