సీత‌గా అలియా భట్..`ఆర్ఆర్ఆర్` మేకింగ్ వీడియో అదుర్స్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో చ‌ర‌ణ్‌కు జోడీగా సీత పాత్ర‌లో బాలీవుడ్ భామ అలియా భ‌ట్‌, ఎన్టీఆర్‌కు జోడీగా జెన్నిఫర్ పాత్ర‌లో హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్‌లు న‌టిస్తున్నారు.

అలాగే అజయ్ దేవ్గన్, శ్రీయ‌లు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్న మేక‌ర్స్‌.. రోజుకో అప్డేట్‌ను వ‌దులుతూ సినిమాపై మ‌రిన్ని అంచ‌నాల‌ను పెంచేస్తున్నారు.

ఇందులో భాగంగానే ఆర్ఆర్ఆర్ సినిమాలోని సీత పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసింది మూవీ టీం. ఈ వీడియోలో అలియా భ‌ట్ నుంచి సీతగా మారే క్రమాన్ని చూపించారు. అంతే కాదు, ఆర్ఆర్ఆర్ కోసం అలియాతో రాజమౌళితో చర్చలు జరపడం, ఆమె షూటింగ్ కోసం హైద‌రాబాద్ రావ‌డం, సీత పాత్రలో ఆమె ఒదిగిపోవ‌డం ఇలా అన్నీ ఆ వీడియోలో ఉన్నారు.

ప్ర‌స్తుతం ఆక‌ట్టుకుంటున్న ఈ మేకింగ్ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ముఖ్యంగా అలియా భ‌ట్ అభిమానులు.. ఈ వీడియో చూసి ఫిదా అయిపోతున్నారు. కాగా, డిసెంబరు 9న ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్‌ విడుదల కానున్న సంగ‌తి తెలిసిందే. కేవలం సామాజిక మాధ్యమాల్లోనే కాదు, అదే రోజున ఉదయం 10గంటలకు థియేటర్స్‌లోనూ ట్రైల‌ర్ రిలీజ్ చేయనున్నారు.

https://www.instagram.com/reel/CXLvIISBeOG/?utm_source=ig_web_copy_link