అలా పిలిచినందుకు ఫ్యాన్స్‌పై మండిప‌డ్డ ప‌వ‌న్‌..అస‌లేమైందంటే?

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అంద‌రికీ అభిమానులు ఉండొచ్చు..కానీ, ప‌వ‌న్ కు మాత్రం ఏకంగా భ‌క్తులే ఉంటారు. అయితే ఆ భ‌క్తులే ఇప్పుడు ప‌వ‌న్‌కు విసుగు తెప్పిస్తున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

Pawan Kalyan Confusing People?

గత కొద్ది కాలం గా పవన్ త‌న అభిమానులకి ఒక విషయాన్ని పదే పదే చెబుతున్నాడు. తనను పవర్ స్టార్ అని పిలవద్ద‌ని, పవర్ లేనివాడు పవర్ స్టార్ కాదని.. తనను జనసేనాని అని పిలవండ‌ని త‌ర‌చూ ప‌వ‌న్‌ చెబుతూనే ఉన్నా.. ఫ్యాన్స్ మాత్రం ప‌వ‌ర్ స్టార్ అంటూ ఎప్ప‌టిక‌ప్పుడు గోల గోల చేస్తూనే ఉన్నారు.

పవన్‌ ఐడియలిస్ట్ పొలిటీషియన్‌ Pawan Kalyan saying I am Okay to be called an idealist politician

ఇక ఆదివారం ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మీటింగ్ ఏర్పాటు చేయ‌గా.. అక్క‌డ కూడా అభిమానులు ప‌వ‌ర్ స్టార్ అంటూ నినాదాలతో రెచ్చిపోయారు. తీవ్ర అసహనానికి గురైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై మండిప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మాట్లాడుతూ.. `తన సభలకు జనం వస్తారు కానీ, ఓట్లు మాత్రం వైసీపీ వాళ్లకు వేస్తారు. అస‌లు మీకు స‌భా మ‌ర్యాద తెలియ‌దా, ప‌వ‌ర్ స్టార్ అని ఎందుకు అరుస్తున్నారు. నన్ను పవర్ స్టార్ అని పిలవడం మానేయండి` అంటూ వార్నింగ్ ఇచ్చారు. దాంతో ప‌వ‌న్ వ్యాఖ్యాలు ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.

Share post:

Latest