అదిరిపోయిన `నీలాంబరి` ఫుల్ సాంగ్‌..డ్యాన్స్ ఇర‌గ‌దీసిన చెర్రీ!

మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీలో సిద్ధ పాత్రలో రామ్‌ చరణ్, నీలాంబరి పాత్రలో పూజ హెగ్డేలు మరో జోడీగా కనిపించనున్నారు. ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

Acharya (2022) - IMDb

అయితే ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా.. రామ్ చరణ్, పూజాహెగ్డే లపై చిత్రీక‌రించిన `నీలాంబరి` మెలోడీ సాంగ్ ప్రోమోను నిన్న దిపావ‌ళి కానుక‌గా విడుద‌ల చేయ‌గా.. నేడు ఫుల్ సాంగ్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ‘నీలాంబరి .. నీలాంబరి .. వేరెవ్వరే నీలామరి, అయ్యోరింటి సుందరి .. వయ్యారాల వల్లరి .. నీలాంబరి’ అంటూ సాగే ఈ సాంగ్ అదిరిపోయింద‌ని చెప్పాలి.

Neelambari Song Promo: మణిశర్మ మ్యూజిక్.., చరణ్ డాన్స్ తో 'నీలాంబరి' అదుర్స్ | Acharya Neelambari Song Promo: Ram Charan Impresses Pooja Hegde with his Elegance Dance Steps

అలాగే చెర్రీ ప్రేయ‌సి పూజా హెగ్డేని పాట రూపంలో తెగ పొగిడేస్తూ డ్యాన్స్ ఇర‌గ‌దీశాడు. ఫొటోగ్రఫీ, కొరియోగ్రఫీ ఈ పాటకు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. ఇక మ‌ణిశర్మ స్వరపరిచిన ఈ పాట‌కు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా.. అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా అందంగా ఆలపించారు. మ‌రి లేటెందుకు మీరూ ఈ సాంగ్‌పై ఓ లుక్కేసేయండి.

Share post:

Latest