10 త‌ల‌ల‌తో ర‌వితేజ‌..భ‌యంక‌రంగా `రావణాసుర` ఫ‌స్ట్ లుక్‌!

November 5, 2021 at 11:28 am

మాస్ మ‌హారాజా ర‌వితేజ త‌న 70వ చిత్రాన్ని ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌తో సుధీర్ వర్మతో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్‌తో కూడిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

Ravi Teja to begin shooting for Trinadha Rao Nakkina's film on October 4 - Movies News

ఈ సినిమాకి `రావణాసుర` అనే టైటిల్ ను .. `హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్` అనే ట్యాగ్ లైన్ ను ఖ‌రారు చేశారు. ఇక ఫ‌స్ట్ లుక్ విష‌యానికి వ‌స్తే.. రావణుడి మాదిరిగా పది తలలతో ద‌ర్శ‌న‌మిచ్చాడు ర‌వితేజ‌. పుర్రెను పోలిన సింహాసనంపై సూటు బూటు వేసుకుని సీరియ‌స్‌గా ర‌వితేజ చూస్తుండ‌గా.. సింహాసనం అంతా కూడా రక్త ధారలతో తడిసి ముద్దై క‌నిపించింది.

Image

మొత్తానికి భ‌యంక‌రంగా ఉన్న ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. అలాగే టైటిల్ మ‌రియు ఫ‌స్ట్ లుక్‌ను బ‌ట్టీ చూస్తుంటే.. ర‌వితేజ ఇప్ప‌టి వ‌ర‌కు ట‌చ్ చేయ‌ని డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్నాడ‌ని స్ప‌ష్టంగా అర్థం అవుతోంది.

10 త‌ల‌ల‌తో ర‌వితేజ‌..భ‌యంక‌రంగా `రావణాసుర` ఫ‌స్ట్ లుక్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts