ఓటీటీలోకి వ‌స్తోన్న అఖిల్ `బ్యాచ్‌ల‌ర్‌`.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌`. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టి.. అఖిల్‌ను స‌క్సెస్ ట్రాక్ ఎక్కించింది.
Most Eligible Bachelor review: A slick, soulless movie that goes nowhere | Business Standard News

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాన్ని ఈ నెల 19న ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా మ‌రియు నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.Most Eligible Bachelor Movie Review & Rating

ఈ సినిమా విడుదలైన 35 రోజుల్లోపే ఓటీటీలో విడుదల కావ‌డం విశేషం. ఈ నేప‌థ్యంలోనే అభిమానులు మరోసారి ఈ సినిమాను చూడోచ్చని తెగ సంబ‌ర‌ పడుతున్నారు. కాగా, గోపీ సుంద‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని బ‌న్నీవాసు, వాసు వ‌ర్మ‌లు క‌లిసి నిర్మించారు. ఆమ‌ని, శ్రీకాంత్ అయ్యంగార్‌, ఈషా రెబ్బా, ఫ‌రియా అబ్దుల్లా త‌దిత‌రులు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషించారు.

Share post:

Latest