నేడు `ఆర్ఆర్ఆర్‌` టీమ్‌కి చాలా స్పెష‌ల్‌..ఎందుకంటే?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థతో రూపుదిద్దుకున్న ఈ మూవీలో ఎన్టీఆర్‌కి జోడీగా ఒలీవియా మోరిస్, చ‌ర‌ణ్‌కి జోడీగా ఆలియా భ‌ట్ న‌టించారు.

Making of RRR: Alia to Ram Charan, RRR stellar cast posts stunning 'Behind the scenes' clip, fans are enthralled - The Financial Express

అలాగే అజయ్ దేవ్గన్, శ్రియా సరన్, సముద్ర ఖని త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది. ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ టీమ్‌కి నేడు ఎంతో స్పెష‌ల్‌.

RRR Teaser Out! Ram Charan, Jr NTR & Alia Bhatt Starrer Is A SS Rajamouli Magnum Opus Made Only For The Big Screen

ఎందుకో తెలుసా.. ఈ సినిమాను ప్ర‌క‌టించి నేటితో నాలుగేళ్లు పూర్తి అయింది. అవును, 2017లో స‌రిగ్గా ఇదే రోజు నాడు ‘ఆర్ఆర్ఆర్’ అనే పాన్ ఇండియన్ సినిమాను రూపొందించబోతున్నట్టుగా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌తో దిగిన ఫొటోలు షేర్ చేశాడు.

Image

ఈ నేప‌థ్యంలోనే ఆనాడు రాజ‌మౌళి చేసిన ట్వీట్‌ను తాజాగా చిత్ర టీమ్ రీ ట్వీట్ చేస్తూ.. `ఆర్ఆర్ఆర్ సినిమా మొదలు పెట్టి 3 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం. మ‌రో 50 రోజుల్లో ఈ సినిమాను రిలీజ్ చెయ్యడానికి సిద్దం చేస్తున్నాం.ఊహించని చిత్ర విచిత్రం.. స్నేహానికి చాచిన హస్తం. జనవరి 7న కలుద్దాం. లెట్స్‌ బ్లాస్ట్‌` అని పేర్కొంటూ ఆనందం వ్య‌క్తం చేసింది.

Share post:

Latest