బింబిసార’ బిగ్ అప్డేట్.. టీజర్ విడుదల డేట్ ఫిక్స్..!

వైవిధ్యభరితమైన సినిమాలతో అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఈయన హీరోగానే కాదు నిర్మాతగా కూడా మంచి విజయాలను అందుకున్నాడు. కళ్యాణ్ రామ్ తన తాత పేరిట ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. తన సొంత బ్యానర్ లో కళ్యాణ్ రామ్ బింబిసార అనే పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ పోస్టర్ కు సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభించింది. కళ్యాణ్ రామ్ తొలిసారిగా ఒక భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. బాహుబలి, మగధీర రేంజ్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్ లో కళ్యాణ్ రామ్ ఒక పెద్ద కత్తి పట్టుకుని శవాల గుట్ట మీద కూర్చున్న పోస్టర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఒక యోధుడిలా కనిపిస్తున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక బిగ్ అప్ డేట్ వచ్చింది. బింబిసార టీజర్ ఈనెల 29 వ తేదీన విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత డిసెంబర్ 2న అఖండ విడుదల రోజున థియేటర్లలో బింబిసార టీజర్ ను ప్రదర్శించి సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు. నందమూరి అభిమానుల్లో బింబిసార సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Share post:

Popular