ఆర్ఆర్ఆర్‌లో ఆ స్టార్ కేవలం పావుగంటే!

November 27, 2021 at 2:42 pm

టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దర్శకధీరుడు రాజమౌళి తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను పూర్తిగా ఫిక్షనల్ కథతో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. కాగా ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో తారక్, చరణ్‌లు కలిసి నటిస్తుండటంతో వీరి కాంబినేషన్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్స్ ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న హైప్‌ను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయి. కాగా ఈ సినిమాలో చరణ్ సరసన అందాల భామ ఆలియా భట్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక ఆమె ఈ సినిమాలో సీత అనే పాత్రలో నటిస్తుండగా, తాజాగా ఆమె పాత్రకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఆలియా భట్ నటన అద్భుతంగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

కాగా ఈ సినిమాలో ఆమె పాత్ర నిడివి కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంటుందట. దీంతో ఆలియా భట్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. అయితే ఉన్న 15 నిమిషాల్లో ఆమె పర్ఫార్మెన్స్ మరో రేంజ్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. చరణ్‌కు తగ్గట్టుగా ఆమె పాత్రను తీర్చిదిద్దాడట జక్కన్న. ఇక చరణ్, ఆలియా భట్‌లపై ఓ డ్యుయెట్ కూడా ఉందని చిత్ర వర్గాల్లో వార్త వినిపిస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో తారక్ సరసన ఒలివియా మారిస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ఆర్ఆర్ఆర్‌లో ఆ స్టార్ కేవలం పావుగంటే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts