అరుదైన గౌరవం దక్కించుకున్న ఏఆర్ రెహమాన్..!

ప్రముఖ సంగీత దర్శకుడిగా వెయ్యి రూపాయలతో తన జీవితాన్ని మొదలు పెట్టిన ఎ.ఆర్.రెహమాన్.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు పది కోట్ల రూపాయల వరకు తీసుకునే స్థాయికి ఎదిగాడు అంటే ఆయన లో ఉన్న ప్రతిభ ఎంతో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గొప్ప సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందిన ఈయన ఎన్నో సినిమాలకు అద్భుతంగా పాటలను అందించి ప్రేక్షకులను మైమరిపింప చేశాడు. ఎక్కువగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేస్తూ ఉండడం గమనార్హం. ఇంతటి గొప్ప సంగీత దర్శకుడు ఒక అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.

భారతీయులనే కాకుండా ప్రపంచ సినీప్రియులను కూడా తన సంగీతంలో అలరిస్తున్న ప్రతిభాశాలి ఏ.ఆర్‌.రెహమాన్‌.. సినీ సంగీతానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి, కైరో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఆయన్ని సత్కరించి, ప్రత్యేక ప్రశంసా పత్రం అందజేశారు.సోమవారం సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు రెహమాన్‌. ఏదిఏమైనా ఇంతటి గౌరవాన్ని దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఏ ఆర్ రెహమాన్ వర్షం వ్యక్తం చేశారు.