విక్టరీ వెంకటేష్‌కి రీచీకటి ఉందట. ఖంగారు పడకండి.. ఎందుకంటే, ఇది రియల్ కాదు రీలే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వెంకటేష్ ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో కలిసి సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో `ఎఫ్ 3` చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. తమన్నా, మెహ్రీన్‌లు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
2019లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెరకెక్కుతోంది. దాదాపు ఎనబై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను బయట పెట్టారు.
ఈ క్రమంలోనే అనిల్ మాట్లాడుతూ.. `ఎఫ్ 3లో వెంకీ రేచీకటి సమస్యతో బాధ పడితే, వరుణ్ తేజ్ నత్తితో ఇబ్బంది పడతాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్లోని సీన్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. వాటిని చూస్తే థియేటర్స్ లో ప్రేక్షకులు పడి పడి నవ్వుకోవడం ఖాయం` అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే రిలీజ్ డేట్ గురించి ప్రస్తావిస్తూ.. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేద్దామని అనుకున్నప్పటికీ పలు కారణాల వల్ల ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నామని తెలిపారు. ఇక ఫైనల్‌గా `ఎఫ్ 2 సినిమాను ఎలా ఎంజాయ్ చేశారో అంతకుమించి ‘ఎఫ్ 3’తో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని` అనిల్ రావిపూడి హామీ ఇచ్చేశారు.