చంద్రముఖి సినిమాలో జ్యోతిక పాత్ర కోసం అంతమంది మారారా..?

ప్రతి మెతుకు మీద.. తినేవారి పేరు ముందే రాసి పెట్టి ఉంటుంది అంటారు. రంగుల ప్రపంచమైన సినీ ఇండస్ట్రీలో అవకాశాలు కూడా ఇలాంటివే. ఏ సినిమాలో, ఏ పాత్ర, ఎప్పుడు ఎవరికి దక్కాలో దేవుడు ముందే నిర్ణయించి ఉంటారు. ఇందుకు సరైన ఉదాహరణగా చంద్రముఖి సినిమాలో జ్యోతిక పాత్ర గురించి చెప్పుకోవచ్చు.

చంద్రముఖి మూవీ బాక్సాఫీస్ సినిమాకు ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. వరుస పరాజయాలతో సతమతం అవుతున్న రజనీకాంత్ కెరీర్ ని మళ్ళీ నిలబెట్టింది కూడా ఈ సినిమానే. కానీ.., చంద్రముఖి సినిమా కారణంగా బాగా పేరు దక్కించుకున్న నటి మాత్రం జ్యోతిక అని చెప్పుకోవచ్చు. చంద్రముఖిగా జ్యోతిక నటన అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమా జ్యోతిక కెరీర్ లోనే మైల్ స్టోన్ గా మారిపోయింది. కానీ.. మీకు తెలుసా? చంద్రముఖి క్యారెక్టర్ జ్యోతిక కన్నా ముందుగా చాలా మంది ముద్దుగుమ్మల వద్దకి వెళ్ళింది. వారంతా ఇంత గొప్ప అవకాశాన్ని చేజాతులా వదిలేసుకున్నారు. ఇంతకీ చంద్రముఖి క్యారెక్టర్ ని మిస్ చేసుకున్న ఆ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

మలయాళంలో మనిచిత్రతాయ సినిమాని చూసిన రజనీకాంత్ తెలుగు, తమిళ భాషల్లో ఈ రీమేక్ కి శ్రీకారం చుట్టారు. దీన్ని డైరెక్ట్ చేసే బాధ్యతని పి.వాసు చేతిలో పెట్టాడు రజని. పి.వాసు ఒరిజినల్ కన్నా గొప్పగా స్క్రీన్ ప్లే మార్చేశాడు. కథ అంతా సిద్దమయ్యాక హీరోయిన్స్ వేట మొదలు పెట్టారు. ఇక్కడ షాకింగ్ ట్విస్ట్ ఏమిటో తెలుసా? చంద్రముఖి క్యారెక్టర్ కోసం పి. వాసు మొదటగా అనుకున్నది జ్యోతికను కాదట. టాలీవుడ్ లో స్నేహ అప్పుడు మంచి ఫామ్ లో ఉండింది. ఆమెని ఈ పాత్ర కోసం సంప్రదించారట మేకర్స్. కానీ.. , స్నేహ ఈ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఇబ్బంది పడటంతో ఆమెకి ఛాన్స్ తప్పింది. తరువాత వాసు సిమ్రాన్ ని సంప్రదించారు. స్నేహకి ఈ క్యారెక్టర్ రేంజ్ ఏమిటో అర్ధం అయ్యింది . మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. కానీ.., త్వరలో షూటింగ్ స్టార్ అవ్వబోతుంది అనగా ఆమె ప్రెగ్నెంట్ అని తేలింది. దీంతో.. సిమ్రాన్ కూడా ఈ క్యారెక్టర్ని వదులుకుంది. ఇక చివరి క్షణంలో మరో ఆప్షన్ లేక కేవలం కళ్ళు పెద్దగా ఉన్నాయి, నాట్యం మీద పట్టు ఉందన్న కారణంతో హీరోయిన్ గా జ్యోతికని ఫైనల్ చేశారు. జ్యోతిక చంద్రముఖిగా నటించడం, ఆ సినేమానా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో జ్యోతిక ఓవర్ దా నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. చూశారు కదా? మరి.. చంద్రముఖి పాత్ర ఇంత మంది చేతులు మారడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.