ఏంటీ.. వెంక‌టేష్‌కి రేచీక‌టా..? గుట్టంతా బ‌య‌ట‌పెట్టిన‌ డైరెక్ట‌ర్‌..!

విక్ట‌రీ వెంకటేష్‌కి రీచీక‌టి ఉంద‌ట‌. ఖంగారు పడ‌కండి.. ఎందుకంటే, ఇది రియ‌ల్ కాదు రీలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. వెంక‌టేష్ ప్ర‌స్తుతం మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌తో క‌లిసి స‌క్సెస్ ఫుల్ డైర‌క్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `ఎఫ్ 3` చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. త‌మ‌న్నా, మెహ్రీన్‌లు ఈ చిత్రంలో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

Venkatesh, Varun Tej's F2 finally rolls out

2019లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెర‌కెక్కుతోంది. దాదాపు ఎన‌బై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మొత్తం డ‌బ్బు చుట్టూనే తిరుగుతుంది. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాకు సంబంధించిన ఎన్నో విష‌యాల‌ను బ‌య‌ట‌ పెట్టారు.

F3 Fun Dose - Dussehra Wishes | Venkatesh, Varun Tej | Anil Ravipudi | Dil  Raju - YouTube

ఈ క్ర‌మంలోనే అనిల్ మాట్లాడుతూ.. `ఎఫ్ 3లో వెంకీ రేచీక‌టి స‌మ‌స్య‌తో బాధ ప‌డితే, వ‌రుణ్ తేజ్ న‌త్తితో ఇబ్బంది ప‌డ‌తాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్లోని సీన్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. వాటిని చూస్తే థియేటర్స్ లో ప్రేక్షకులు పడి పడి నవ్వుకోవ‌డం ఖాయం` అంటూ చెప్పుకొచ్చారు.

F3: Fun and Frustration'' team poses for a happy picture on the sets |  Telugu Movie News - Times of India

అలాగే రిలీజ్ డేట్ గురించి ప్ర‌స్తావిస్తూ.. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేద్దామని అనుకున్న‌ప్ప‌టికీ ప‌లు కార‌ణాల వ‌ల్ల ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నామ‌ని తెలిపారు. ఇక ఫైన‌ల్‌గా `ఎఫ్ 2 సినిమాను ఎలా ఎంజాయ్ చేశారో అంతకుమించి ‘ఎఫ్ 3’తో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని` అనిల్ రావిపూడి హామీ ఇచ్చేశారు.

Share post:

Popular