ప్ర‌ముఖ ఓటీటీకి `ఆచార్య‌`.. భారీ రేటుకు కుదిరిన డీల్‌..?!

మెగాస్టార్ చిరంజీవి, మెగా వ‌ప‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగి ఉంటే ఈ చిత్రం మే 13న విడుద‌ల అయ్యుండేది. కానీ, క‌రోనా సెకెండ్ వేవ్ అడ్డుప‌డ‌టంతో వాయిదా ప‌డింది. ఇక ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది 2022, ఫిబ్రవరి 4న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు దక్కించుకున్నార‌ట‌.

భారీ రేటుకు డీల్ కుదిరింద‌ని తెలుస్తుండ‌గా.. థియేట‌ర్‌లో విడుద‌లైన కొన్ని వారాల‌కు ఆచార్య అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంద‌ని స‌మాచారం. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. కాగా, ఆచార్య‌ను పూర్తి చేసుకున్న చిరంజీవి ప్ర‌స్తుతం మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో `గాడ్ ఫాద‌ర్‌` చిత్రం చేస్తున్నాడు.

దీంతో పాటుగా చిరంజీవి మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో `భోళా శంకర్` చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌బోతుండ‌గా.. చిరుకి చెల్లెలుగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత చిరు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్న విష‌యం తెలిసిందే.

Share post:

Latest