ఈసారి బై సెక్సువల్ పాత్రలో.. విడాకుల తర్వాత మరింత బోల్డ్ గా స్టార్ హీరోయిన్..!

November 26, 2021 at 11:18 am

నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత మరింత చెలరేగుతోంది. వరుసగా ప్రాజెక్టులు ఓకే చేస్తూ దూసుకెళ్తోంది. ఫ్యామిలీమెన్ 2 తర్వాత బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్న సమంత ప్రస్తుతం.. ఒక హాలీవుడ్ చిత్రంలో నటించేందుకు అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమంత ఒక ట్వీట్ చేసింది. హాలీవుడ్ లో ప్రముఖ డైరెక్టర్ ఫిలిప్ జాన్ దర్శకత్వం లో ‘అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్’ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్లు పేర్కొంది.

సమంతకు ఇదే తొలి ఇంటర్నేషనల్ మూవీ. భారత రచయిత తిమేరి ఎన్ మురారి రచించిన నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సమంత డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతున్న 27 ఏళ్ల బైసెక్సువల్ తమిళ అమ్మాయి గా ఒక బోల్డ్ పాత్రలో నటించనుంది. అంటే పురుషులతోపాటు అమ్మాయిల ఆకర్షణకు లోనయ్యే పాత్రలో సమంత నటిస్తోంది. సమంత ఇదివరకు సూపర్ డీలక్స్, ఫ్యామిలీ మెన్ 2 లో బోల్డ్ రోల్స్ లో నటించింది.

‘పూర్తిగా సరికొత్త ప్రపంచం అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ మూవీలో నేను కూడా భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నా. అను పాత్ర కోసం నన్ను ఎంచుకునేందుకు థాంక్యూ ఫిలిప్ జాన్. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అని సమంత ట్వీట్ చేసింది.

ఈసారి బై సెక్సువల్ పాత్రలో.. విడాకుల తర్వాత మరింత బోల్డ్ గా స్టార్ హీరోయిన్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts